న్యూస్

Spirit: ప్రభాస్ పాటలు అదుర్స్

ప్రభాస్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కలయికలో “స్పిరిట్” (Spirit) సినిమా రూపొందుతోంది. ఈ సినిమా షూటింగ్ ఒక పది రోజులు మాత్రమే ఇప్పటివరకు జరిగింది. ఇది పూర్తి కావాలంటే మరో 10 నెలలు పడుతుంది. కానీ అప్పుడే ఈ సినిమా పాటల గురించి, మ్యూజిక్ గురించి చర్చ మొదలైంది.

సందీప్ రెడ్డి వంగా ఇప్పటివరకు మూడు సినిమాలు తీశాడు. మూడూ పెద్ద హిట్. అన్నీ మ్యూజికల్ హిట్స్. అందుకే, ఈ సినిమా పాటల విషయంలో భారీ అంచనాలు ఉన్నాయి.

“యానిమల్ కి మ్యూజిక్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకి సంగీతం ఇస్తున్నాడు. ఇప్పటికే మూడు పాటలు పూర్తి అయ్యాయి. రెండు పాటలు రికార్డు చేశాం. నేను రాసిన పాటలు అదిరిపోయాయి. ప్రభాస్ ఈ సినిమాలో మామూలుగా ఉండడు. అభిమానులకు పూనకాలే. థియేటర్లో ఈ సినిమా పాటలు ఊపేస్తాయి,” అని పాటల రచయిత అనంత శ్రీరామ్ చెప్పారు.

దాంతో “స్పిరిట్” పాటలపై మరింతగా హైప్ పెరిగింది.

ఈ సినిమాలో ప్రభాస్ సరసన త్రిప్తి డుమ్రి నటిస్తోంది. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది.

TeluguCinema

Recent Posts

Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…

8 hours ago

Nandamuri Balakrishna: విలక్షణమైన కాంబో మళ్లీ కలుస్తోందా?

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…

9 hours ago

Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు

ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…

13 hours ago

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

16 hours ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

16 hours ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago