ఇంటర్వ్యూలు

సరస్వతి పాత్ర ప్రత్యేకం: Mrunal Thakur

అడివి శేష్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ “డెకాయిట్” (Dacoit) లో తాను పోషించిన సరస్వతి పాత్ర తన కెరీర్‌లో గుర్తుండిపోయేలా ఉంటుందని హీరోయిన్ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) తెలిపారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతుండగా, అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమైంది.

భిన్నమైన పాత్రలు ఇష్టం

విలేకరుల సమావేశంలో మృణాల్ మాట్లాడుతూ, సరస్వతి పాత్ర చాలా క్లిష్టమైనదైనా, దర్శకుడు దాన్ని సులభంగా అర్థమయ్యేలా మలిచారని చెప్పారు. “ఒక నటిగా ఛాలెంజింగ్ పాత్రలు చేయడం ఎప్పుడూ సంతోషమే. ఈ పాత్ర నాకు కొత్త అనుభవాన్ని ఇచ్చింది” అని పేర్కొన్నారు.

ఇది తన కెరీర్‌లో భిన్నమైన పాత్ర అని, ఇప్పటివరకు చేయని జానర్‌లో నటించానని ఆమె తెలిపారు. “చేజింగ్ సన్నివేశాలు, డ్రైవింగ్ సీక్వెన్స్‌లు చాలా ఎంజాయ్ చేశాను. కొన్ని రిస్కీ యాక్షన్ స్టంట్స్ కూడా చేశాను. ప్రేక్షకులు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు” అని అన్నారు.

తెలుగింటి అమ్మాయిలా మారాను

తెలుగు ప్రేక్షకులు తనను స్వంతింటి అమ్మాయిలా ఆదరించారని, “సీతారామం”, “హాయ్ నాన్న”, “ఫ్యామిలీ స్టార్” సినిమాల తర్వాత వచ్చిన ప్రేమాభిమానాలు మరువలేనివని చెప్పారు. సరస్వతి పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మకం వ్యక్తం చేశారు.

కథ విన్నప్పుడే సరస్వతి, హరి ఎందుకు డెకాయిట్స్‌గా మారారన్న అంశం ఆసక్తికరంగా అనిపించిందని, అది తెరపై చూడాల్సిందేనని అన్నారు. “ఇది ఒక భిన్నమైన ప్రేమకథ” అని వివరించారు.

అడివి శేష్ గురించి మాట్లాడుతూ, ఆయన నటన ఈ చిత్రంలో ప్రత్యేకంగా నిలుస్తుందని చెప్పారు. “ఇది ఆయన కెరీర్‌లో బెస్ట్ సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది” అని అభిప్రాయపడ్డారు. అనురాగ్ కశ్యప్‌తో కలిసి పనిచేయడం మంచి అనుభవమని, తెలుగు డైలాగ్స్ నేర్చుకోవడం ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు.

హిందీ, తెలుగు భాషల్లో ఒకేసారి చిత్రీకరణ చేయడం సవాలుగా అనిపించిందని, ఇది కొత్త అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు.

షూటింగ్ అనుభవం గురించి మాట్లాడుతూ, ఎక్కువ భాగం అవుట్‌డోర్‌లోనే చిత్రీకరణ జరిగిందని, ముఖ్యంగా రోడ్లపై తీసిన యాక్షన్ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉన్నాయని చెప్పారు. “ఒక అంబులెన్స్ నడిపే సన్నివేశంలో హ్యాండ్ బ్రేక్ లేకపోవడంతో కొంత రిస్క్ ఫీల్ అయ్యింది. అయినా ఆ అనుభవం చాలా ప్రత్యేకం” అని మృణాల్ వివరించారు.

TeluguCinema

Recent Posts

Varanasi: రాజమౌళి మూవీ ఏప్రిల్ 7 నుంచి వాయిదా పడుతుందా?

రాజమౌళి తీస్తున్న భారీ చిత్రం "వారణాసి" (Varanasi)పై అంచనాలు మాములుగా లేవు. విడుదల టైంకి ఇంకా భారీగా ఉంటుంది హైప్.…

7 hours ago

Nandamuri Balakrishna: విలక్షణమైన కాంబో మళ్లీ కలుస్తోందా?

నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వరుస సినిమాలను ప్రకటిస్తూ టాలీవుడ్‌లో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో తనకు 'వీరసింహారెడ్డి'…

8 hours ago

Prabhas: మూడేళ్ళ తర్వాత ఒకే ఏడాది రెండు చిత్రాలు

ప్రభాస్ (Prabhas) ఒకేసారి రెండు, మూడు చిత్రాలను సెట్స్ పై ఉంచుతాడు. 'బాహుబలి 2' విడుదల తర్వాత ఇలా చేస్తూ…

12 hours ago

Srinidhi Shetty: నిర్మాతల కోరికని మన్నించని అందాల నిధి

నటి శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) తన పారితోషికాన్ని తగ్గించాలన్న నిర్మాతల మాటకి నో చెప్పిందట. రెమ్యునరేషన్ విషయంలో తగ్గేదే…

15 hours ago

తెలుగు ఇండస్ట్రీలో చాలా మంచి ఉంది: Rakul Preet Singh

బాలీవుడ్‌కు వెళ్లిన తర్వాత తెలుగు సినీ పరిశ్రమపై విమర్శలు చేసిన హీరోయిన్లలో తాప్సీ, తమన్నా కన్పిస్తారు.. తెలుగు సినిమాల ద్వారానే…

15 hours ago

అక్కినేని అప్రూవల్ నాకు అక్కర్లేదు: Sobhita

అక్కినేని కోడలు శోభిత (Sobhita) లేటెస్ట్ స్టేట్ మెంట్ ఇది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా, షాకింగ్ గా అనిపించినప్పటికీ…దీని వెనక…

2 days ago