రామ్ చరణ్ (Ram Charan) అభిమానులకు మరో చేదు వార్త. “పెద్ది” (Peddi) మరోసారి వాయిదా పడబోతోందా? అనే ప్రశ్న జనం మదిలో ఉంది. దానికి సమాధానం అవును అనే చెప్పాలి. “పెద్ది” సినిమా ఈ నెల విడుదల కావడం లేదు. ఈ విషయంలో క్లారిటీ వచ్చింది.
ఏప్రిల్ 30 నుంచి కూడా వాయిదా పడబోతోంది. రెండు, మూడు రోజుల్లో ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తారు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తోన్న ఈ సినిమాని మొదట మార్చి 27న విడుదల చెయ్యాలనుకున్నారు. ఆ తర్వాత సినిమాని ఏప్రిల్ 30కి వాయిదా వేశారు. తాజా సమాచారం ప్రకారం మరో రెండు నెలలు వెనక్కి వెళ్తోంది.
కుదిరితే జూన్ లేదంటే ఆగస్టులో విడుదల చెయ్యాలని భావిస్తున్నారట. ఈ సినిమాపై చాలా హైప్ ఉంది. అందరిలోనూ పాజిటివ్ బజ్ ఉంది. సినిమా కూడా బాగా వచ్చింది అని టాక్. పాన్ ఇండియా లెవల్లో గ్యారెంటీగా హిట్ అయ్యే ఈ సినిమా విషయంలో ఎందుకు రాజీ పడాలి అని దర్శకుడి భావన. లేట్ అయినా సినిమాని టెక్నీకల్ గా కూడా సూపర్ ఉండేలా ప్యాకేజ్ చేసేందుకు దర్శకుడు కష్టపడుతున్నాడు. అందుకే మరోసారి వాయిదా పడుతోంది.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…