నాని (Nani), శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) కాంబినేషన్‌లో ఇంతకుముందు “దసరా” చిత్రం వచ్చింది. అది భారీ విజయం అందుకొంది. ఇప్పుడు “ది ప్యారడైజ్” (The Paradise) చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాని ప్రకటించినప్పటి నుంచే అంచనాలు పెంచడం మొదలు పెట్టింది. ఇటీవల విడుదలైన “ఆయా షేర్” అనే మొదటి పాట వైరల్ అయింది. ఈ సినిమాపై ఆల్రెడీ ఉన్న హైప్ ని మరింత పెంచింది.
ఐతే షూటింగ్ విషయంలోనే ఈ సినిమా సమస్యలు ఎదుర్కొంటోంది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ప్రతి షాట్, సీన్ పర్ఫెక్ట్ గా ఉండాలని పరితపిస్తాడట. దాంతో, షూటింగ్ ఒక పట్టాన ముందుకెళ్లడం లేదు. ఇప్పటివరకు సగమే షూటింగ్ పూర్తి అయింది. మార్చి 27న విడుదల కావాల్సిన ఈ సినిమాని ఇదే కారణంతో ఏకంగా ఆగస్టు చివరికి పోస్ట్ ఫోన్ చేశారు.
సాధారణంగా ఏ సినిమానైనా ఒక నెల, రెండు నెలలు వాయిదా వేస్తారు. కానీ శ్రీకాంత్ ఓదెల తీస్తున్న విధానం, అతని వర్కింగ్ స్టయిల్ చూసే హీరో నాని సినిమాని ఐదు నెలలు వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఐతే, ఈ ఆగస్టు నెలలో కూడా విడుదల కావడం కష్టమే అని తాజా సమాచారం.
అందుకే, ఈ సినిమా ఆగస్టు నుండి డిసెంబర్‌కు వెళ్లే అవకాశం ఉందనేది తాజా పుకారు.
సో, నాని వేసుకున్న లెక్కలు, ప్లాన్లు అన్నీ తారుమారు అయ్యాయి. ఈ ఏడాది ఈ సినిమాని విడుదల చేస్తే కానీ దర్శకుడు సుజీత్ ప్రకటించిన “బ్లడీ రోమియో” (Bloody Romeo) షూటింగ్ స్పీడ్ అందుకోదు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి.
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…
రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…