సాయి పల్లవి గొప్ప డ్యాన్సర్. ఆమెలా డ్యాన్స్ చేసే హీరోయిన్లు చాలా తక్కువ. శ్రీలీల వచ్చిందిప్పుడు. కానీ సాయి పల్లవి స్టెప్స్ వేరు. గ్లామర్ షో లేకుండా చేసే ఆమె డ్యాన్స్ కి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు.
ఐతే, ఇటీవల ఆమె ప్రతి సినిమాల్లో అవసరం ఉన్నా లేకున్నా… డ్యాన్స్ లు చెయ్యడం, అలాంటి పాటలు పెట్టడం వల్ల జనాలు మొనాటనీ ఫీల్ అవుతున్నారు. దాని వల్ల, ఆ సినిమాలకే ఎక్కువ నష్టం. ఇప్పటికే “తండేల్” విషయంలో ఆ ప్రమాదం జరిగింది.
“తండేల్” సినిమాలో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించారు. ఇంతకుముందు వీరిద్దరూ శేఖర్ కమ్ముల తీసిన “లవ్ స్టోరీ”లో కూడా జంటగా కనిపించారు. ఆ సినిమాలో డ్యాన్స్ కి కథలోనే స్కోప్ ఉంది. కానీ “తండేల్”లో అలాంటిది ఏమి లేదు. బలవంతంగా రెండు పాటల్లో ఆమె డ్యాన్స్ పైనే ఫోకస్ పెట్టింది టీం.
కానీ ఈ సినిమా అమెరికా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఆమె డ్యాన్స్ కోసం కూడా వాళ్ళు రాలేదు. తెలుగునాట కూడా యావరేజ్ గానే ఆడింది. సాయి పల్లవి డ్యాన్స్ కానీ, ఆమె నటన కానీ జనాలను పెద్దగా ఊపెయ్యలేదు. ఇంతకుముందు వచ్చిన “అమరన్” సినిమాలో సాయి పల్లవి ఇవేవీ చెయ్యలేదు. కానీ అద్భుతమైన నటన ప్రదర్శించింది. ఆ సినిమా బాగా ఆడింది.
కథ ప్రకారమే వెళ్ళాలి తప్ప ఆమె డ్యాన్స్ ని ఇరికిస్తే జనం చూడరు.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…