రక్షిత గుర్తుందా? సరిగ్గా 23 ఏళ్ల క్రితం రక్షిత సంచలనం సృష్టించింది. బెంగుళూర్ నుంచి వచ్చి హైదరాబాద్ లో పాపులర్ అయింది. పూరి తీసిన “ఇడియట్” సినిమాతో పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు ఆమెకి 40 ఏళ్ళు. వయసు పెరుగుతున్న కొద్దీ హీరోయిన్లు మారిపోతారు. చాలా మంది బాగా లావు అయిపోతారు అది సహజం. కానీ రక్షిత మరీ 40 ఏళ్లకే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.
తాజాగా ఆమె పూరి జగన్నాథ్ ని కలిసిన ఫోటోలు షేర్ చెయ్యడంతో ఆమె వైరల్ అయింది.
నాలుగు రోజుల క్రితం పూరి ఆమె భర్త ప్రేమ్ తీస్తున్న కొత్త సినిమా షూటింగ్ లొకేషన్ కి వెళ్ళాడు. ఆ ఫోటోలను ఆమె షేర్ చేసింది. అటు ప్రేమ్, ఇటు పూరి మధ్య నిలుచున్న ఆమె ఫోటోలను తెలుగు సోషల్ మీడియా హ్యాండిల్స్ తెగ వైరల్ చేశాయి. “ఈ హీరోయిన్ ని గుర్తుపట్టారా?,” “పూరి ఒకప్పటి గాళ్ ఫ్రెండ్ ఇలా అయింది,” అంటూ యూట్యూబ్ థంబ్ నెయిల్స్ హోరెత్తించాయి.
పూరిని ఆమె తన సెట్ కి పిలిచింది. ఆమె ఇప్పుడు కన్నడ సినిమాల్లో నిర్మాతగా సెటిల్ అయింది.
“నా జీవితంలో మరిచిపోలేని ఇద్దరు వ్యక్తులు… పూరి, ప్రేమ్. ‘అప్పు’ సినిమాతో నా జీవితాన్ని మలుపు తిప్పారు పూరి. ప్రేమ్ గురించి చెప్పక్కర్లేదు,” అంటూ ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రాసుకున్నారు. ప్రేమ్ ని ఆమె పెళ్లి చేసుకొంది. వీరికి ఒక బాబు.
తెలుగులో రక్షిత “పెళ్ళాం ఊరెళితే”, “శివమణి”, “లక్ష్మి నరసింహ”, “ఆంధ్రావాలా”, “అందరివాడు” వంటి అనేక చిత్రాల్లో నటించింది.
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…