నటి కల్పిక గణేష్ ఇటీవల ఒక పబ్ లో గొడవచేసి వార్తల్లో నిలిచింది. తెగ తాగి అలా అల్లరి చేసింది అని మీడియాలో, సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆ విషయం గురించి మాట్లాడింది. నేను ఆ రోజు పబ్ లో తాగలేదు అని చెప్పింది.
మరి పబ్ కి తాగడానికి కాకుండా దేనికోసం వెళ్తారు? అదీ కూడా రెగ్యులర్ గా? నేను పబ్ కి రెగ్యులర్ కస్టమర్ ని అనే ఆమె ఆ రోజు గొడవలో చెప్పుకొంది. మరి తాగడానికి కాకుండా పబ్ కి ఎందుకు వెళ్తోంది అనే డౌట్ మనకి వస్తుంది కదా. దానికి ఆమె వివరణ ఇచ్చింది.
“అవును నేను ఇదివరకు తాగేదాన్ని. మా ఇంట్లో కూడా తెలుసు. కానీ కొంతకాలంగా తాగడం లేదు. ఆల్కహాల్ తీసుకోవడం మానేశా,” అని వివరణ ఇచ్చింది.
ఐతే, కల్పిక గణేష్ వివరణ ఎలా ఉన్నా.. ఆ పబ్ లో గొడవతో ఈ భామ ఒక్కసారిగా ఫేమస్ అయింది. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” “హిట్”, “యశోద” వంటి సినిమాల్లో నటించింది. కానీ సినిమాలలో పాత్రల కన్నా ఈ పబ్ గొడవతో ఎక్కువ పాపులర్ అయిన మాట నిజం.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…