ప్రభాస్ చేయబోయే ‘స్పిరిట్’ సినిమా ఎక్కువగా నలుగుతోంది. ప్రభాస్ నుంచి రాబోయే సినిమాల్లో ఎక్కువగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఈ సినిమానే. దీనికి కారణం సందీప్ రెడ్డి వంగ, ‘యానిమల్’ సినిమాతో బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ కొట్టడమే.
ఇక ‘స్పిరిట్’ సినిమా విషయానికొస్తే, ఇందులో ప్రభాస్ సరసన హీరోయిన్ గా కరీనా కపూర్ ను తీసుకుబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇది ఇప్పటిది కాదు, దాదాపు నెల రోజులుగా జరుగుతున్న ప్రచారం.
ఎట్టకేలకు దీనిపై స్పందించింది కరీనా కపూర్. “ప్రభాస్ సరసన హీరోయిన్ గానా… నో ఛాన్స్” అంటూ స్పందించింది కరీనా. ‘స్పిరిట్’ సినిమాకు సంబంధించి తనను ఎవ్వరూ సంప్రదించలేదని, తన వరకు ఎవ్వరూ రాలేదని ఆమె స్పందించింది. ఓ టాక్ షోలో పాల్గొన్న కరీనా, ఇలా ‘స్పిరిట్’ సినిమాపై క్లారిటీ ఇచ్చింది.
నిజానికి ఈ టాక్ బయటకొచ్చిన వెంటనే ప్రభాస్ ఫ్యాన్స్ వ్యతిరేకించారు.
వయసైపోయిన కరీనాను తీసుకోవద్దంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఉద్యమమే మొదలుపెట్టారు. కరీనా తాజా స్టేట్ మెంట్ తో వాళ్లు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాలీవుడ్ లో సినిమాకు బజ్ రావాలంటే కరీనా కాకపోయినా, మరో హీరోయిన్ ను తీసుకోవాల్సిందే. అది ఎవరనేది సందీప్ వంగ త్వరలోనే తేలుస్తాడు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…