పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పసుపు తాడుతో కనిపించింది కీర్తి సురేష్. పెళ్లయిన తర్వాత హీరోయిన్లంతా మళ్లీ నార్మల్ లైఫ్ లోకి వచ్చేస్తారు. కానీ కీర్తిసురేష్ మొత్తం మెడలో పసుపు తాడుతోనే తన సినిమా ప్రచారానికి వచ్చింది. దీని వెనక స్టోరీని ఆమె బయటపెట్టింది.
“మా సంప్రదాయం ప్రకారం, పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు పసుపు తాడుతో చేసిన మంగళసూత్రాన్ని మెడలో ధరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఓ మంచి రోజు చూసి పసుపు తాడు స్థానంలో బంగారం చైన్ పెట్టుకోవచ్చు. నా పెళ్లి తర్వాత బంగారం గొలుసు ధరించడానికి మంచి రోజులు రాలేదు. అందుకే పసుపు తాడుతోనే ప్రచారానికి వచ్చాను. నిజానికి మా కుటంబంలో కొందరు కావాలంటే తాడు తీసేసి, గొలుసు వేసుకోవచ్చన్నారు. కానీ సంప్రదాయం పాటించాలని నాకే అనిపించింది.”
15 ఏళ్ల నుంచి ప్రేమలో ఉన్నప్పటికీ, కీర్తిసురేష్-ఆంటోనీ తటిల్ లవ్ మేటర్ బయటకు రాలేదు. దీనికి కూడా కారణం వెల్లడించింది.
“మా ఇద్దరి కామన్ ఫ్రెండ్స్ కోలీవుడ్ లో లేరు. అందుకే మా ప్రేమ విషయం రహస్యంగా ఉంది. మరీ ముఖ్యంగా మేమిద్దరం కూడా చాలా సీక్రెట్ గా ఉంచాం. ఇక పెళ్లి విషయానికొస్తే, 2022 ఏప్రిల్ నుంచే పెళ్లి గురించి మేం మాట్లాడుకుంటూ వచ్చాం.”
అయితే తన లవ్ మేటర్ ఇండస్ట్రీలో కొంతమందికి తెలుసని చెప్పుకొచ్చింది కీర్తి సురేష్. సమంత, విజయ్, అట్లీ, ఐశ్వర్య లక్ష్మి లాంటి కొంతమందికి కీర్తిసురేష్ ప్రేమలో ఉన్న విషయం చాన్నాళ్ల ముందే తెలుసంట.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…