పెళ్లి తర్వాత హీరోహీరోయిన్లు కాస్త గ్యాప్ తీసుకోవడం సహజం. అయితే ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు నటీనటులెవ్వరూ గ్యాప్ తీసుకోవడం లేదు. ఇలా పెళ్లి చేసుకొని, ఏం జరగనట్టు అలా సెట్స్ పైకి వచ్చేస్తున్నారు. కీర్తి సురేష్ అయితే ఏకంగా మెడతో తాళిబొట్టుతో సినిమా ఫంక్షన్లకు వచ్చేసింది.
అలా పెళ్లి తర్వాత పెద్దగా గ్యాప్ ఇవ్వని ఈ బ్యూటీ, ఇప్పుడు మరింత జోరు చూపిస్తోంది.
పెళ్లి తర్వాత తొలి ప్రాజెక్టుకు ఆమె సంతకం చేసినట్టు తెలుస్తోంది. తమిళంలో అశోక్ సెల్వన్ సరసన ఓ సినిమా చేయబోతోంది కీర్తి సురేష్.
ఆమె నటించిన చాలా ప్రాజెక్టులు పైప్ లైన్లో ఉన్నాయి. త్వరలోనే అవన్నీ ఒక్కొక్కటిగా మార్కెట్లోకి రాబోతున్నాయి. ఓవైపు ఆ పనులు జరుగుతుండగా, మరోవైపు ఇలా కొత్త సినిమాలకు సైన్ చేస్తూ తన జోరు చూపిస్తోంది కీర్తి.
అయితే తెలుగులో మాత్రం ఆమె స్ట్రయిట్ సినిమాలో కనిపించి చాన్నాళ్లయింది. ‘భోళాశంకర్’ తర్వాత మళ్లీ ఆమె తెలుగుతెరపై కనిపించలేదు. ‘కల్కి’ సినిమాలో చిట్టి పాత్రలో తన గొంతు మాత్రం వినిపించింది. 32 ఏళ్ల ఈ నటి త్వరలోనే ‘అక్క’ అనే వెబ్ సిరీస్ తో మనల్ని అలరించనుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…