సోనాక్షి సిన్హా ఇటీవలే తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొంది. బాలీవుడ్ లో కూడా ఆమెకి పెద్ద సినిమా ఆఫర్లు లేవు ఇప్పుడు. ఇలాంటి టైంలో ఈ భామ తెలుగులోకి అని వార్తలు వస్తున్నాయి.
ఈ ‘దబాంగ్’ బ్యూటీ తెలుగులో సుధీర్ బాబు సరసన నటించనుంది అని టాక్. సుధీర్ బాబు “ఝాటధరా” అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. బాలీవుడ్ కి చెందిన ప్రేరణ అరోరా అనే నిర్మాత ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఒక పెద్ద హీరోయిన్ ని తీసుకోవాలని ప్రయత్నించి చివరికి సోనాక్షిని తీసుకున్నారట.
సోనాక్షి గతంలో బాలకృష్ణ సరసన ఒక సినిమాలో చెయ్యాల్సి ఉంది. కానీ చివరి నిమిషంలో ఆమె నో చెప్పింది. అలాగే మెగాస్టార్ సరసన “ఆచార్య”లో మొదట ఆమెని తీసుకోవాలనుకున్నారు. మొత్తానికి ఈ భామ ఇప్పుడు తెలుగులో అరగేంట్రం చెయ్యనుంది అన్నమాట.
ఐతే, అధికారిక ప్రకటన రావాలి.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…