బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘ఛావా’ సినిమాను తెలుగులోకి తీసుకొస్తోంది గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్. స్వయంగా బన్నీ వాస్ ఈ సినిమా డబ్బింగ్ బాధ్యతల్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాడు.
ఈ సినిమా తెలుగులోకి వస్తుందనే న్యూస్ బయటకొచ్చిన వెంటనే, ఇందులో కీలకమైన వాయిస్ ఓవర్ కు తెలుగులో డబ్బింగ్ చెప్పించేందుకు ఎన్టీఆర్ ను తీసుకొస్తున్నారనే ప్రచారం జరిగింది. దీనిపై బన్నీ వాస్ స్పందించాడు.
తమ సినిమా కోసం ఎన్టీఆర్ ను సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడని, తమకు కూడా స్టార్ హీరోను తీసుకొచ్చి డబ్బింగ్ చెప్పించేంత టైమ్ లేదని క్లారిటీ ఇచ్చాడు. ప్రొఫెషనల్ డబ్బింగ్ ఆర్టిస్టులతోనే ‘ఛావా’ సినిమాకు డబ్బింగ్ చెప్పిస్తున్నామన్నాడు.
ఈ సందర్భంగా వివాదాలపై కూడా స్పందించాడు. ‘ఛావా’ సినిమా పలు వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. తెలుగు రిలీజ్ పై ఆ ప్రభావం ఉండదని, తాము కేవలం డిస్ట్రిబ్యూటర్ గా మాత్రమే వ్యవహరిస్తున్నామని, ఐపీ రైట్స్ మొత్తం అసలైన నిర్మాత దగ్గరే ఉన్నాయని, వివాదాలేమైనా ఉంటే వాటితో తమకు సంబంధం లేదని అంటున్నాడు.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…