మాళవిక మోహనన్ మరో గమ్మత్తైన విషయాన్ని బయటపెట్టింది. చాలామంది డాక్టర్ అవుదామని యాక్టర్ అయ్యామని చెబుతుంటారు. మాళవిక మోహనన్ మాత్రం డైరక్టర్ అవుతాదమనుకొని హీరోయిన్ గా మారిందంట.
రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఆమె బయటపెట్టింది. ‘రాజాసాబ్’ రిలీజ్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఈ బ్యూటీ.. తనకు దర్శకత్వం అంటే తెగ ఇష్టమంటోంది. దర్శకత్వానికి సంబంధించి ఈమె కొన్ని పుస్తకాలు కూడా చదివిందంట.
అలా దర్శకత్వం వైపు వద్దామని ఆలోచన చేస్తున్న టైమ్ లో యాడ్స్ అవకాశాలు రావడం, ఆ తర్వాత సినిమా ఛాన్సులు రావడంతో నటన వైపు వచ్చానంటోంది ఈ బ్యూటీ. తమిళ్ లో విజయ్ సినిమాతో పాపులర్ అయిన ఈ చిన్నది, తెలుగులో ప్రభాస్ సినిమాతో రైజ్ అవ్వాలనుకుంటోంది.
హీరోయిన్ గా కెరీర్ కొనసాగిస్తున్నప్పటికీ, ఏదో ఒక టైమ్ లో దర్శకత్వం చేస్తానంటోంది మాళవిక. ఒకవేళ దర్శకురాలిగా మారకుంటే, మంచి ఫొటోగ్రాఫర్ గా స్థిరపడేదాన్నని చెప్పుకొచ్చింది.
మాళవిక తండ్రి మోహనన్ పేరొందిన కెమెరామెన్. తెలుగులో మహేష్ బాబు హీరోగా రూపొందిన “మహర్షి”, విజయ్ దేవరకొండగా రూపొందిన “ఫ్యామిలీ స్టార్” వంటి చిత్రాలకు కెమెరా అందించారు. బాలీవుడ్ లో బడా సినిమాలు ఎన్నో తీశారు తన కెమెరాతో. సో, తండ్రి కెమెరామెన్ కాగా ఆమె హీరోయిన్ గా మారింది. ఇప్పుడు డైరెక్టర్ అవ్వాలనుకుంటోంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…