ఊహించని విధంగా శృతిహాసన్ నుంచి వెరైటీ పోస్టు పడింది. క్రిప్టో కరెన్సీకి చెందిన ఆ పోస్టు చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, ఆమె ట్విట్టర్ ఎకౌంట్ హ్యాక్ అయింది.
75 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్న శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. ఎవరో అగంతకులు ఆమె ఎకౌంట్ ను హ్యాక్ చేసి, తమ క్రిప్టో కరెన్సీ ప్రచారం చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇనస్టాగ్రామ్ లో శృతిహాసన్ ప్రకటించింది.
తన ట్విట్టర్ ఎకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని, దయచేసి ఎవ్వరూ తన ఎకౌంట్ తో ఇంటరాక్ట్ అవ్వొదని ఆమె విజ్ఞప్తి చేసింది. త్వరలోనే మళ్లీ ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకుంటానని ఆమె తెలిపింది.
కొన్నేళ్ల కిందట కూడా ఇలానే శృతిహాసన్ ఎకౌంట్ హ్యాక్ అయింది. దాన్ని తిరిగి పునరుద్ధరించడానికి ఆమెకు 3 రోజులు పట్టింది.
మరోవైపు, శృతి హాసన్ తన కొత్త చిత్రం “కూలి” విడుదలకు ఎదురు చూస్తోంది. ఈ సినిమాలో ఆమె రజినీకాంత్ కూతురిగా నటించినట్లు టాక్.
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…