సినిమా హీరోల్లో చాలామంది బాగా తాగుతారు – మందుతో పాటు సిగరెట్లు. ప్రస్తుతం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వెలుగొందుతోన్న పలువురు హీరోలు సెట్స్ లో కాల్చే సిగరెట్లు గురించి చెప్తే అదో పెద్ద కథ అవుతుంది. 80లల్లో, 90లలో కూడా చాలా మంది స్టార్స్ చైన్ స్మోకర్స్. సూపర్ స్టార్ రజినీకాంత్ బహిరంగంగానే తాను సిగరెట్లు తెగ కాల్చేవాణ్ణి అని తెలిపారు.
ఇక ఈ తరం హీరోయిన్లలో పలువురు మందుకు అడిక్ట్ అయ్యారు. ఐతే, 90లలో షూటింగ్ లొకేషన్ లలో హీరోయిన్లు పద్దతిగా ఉండేవాళ్ళు. హీరోల్లోలా సిగరెట్లు తాగేవాళ్లు కాదు. కానీ, తాను రెబెల్ గా ఉండేదాన్ని అని, అప్పట్లో తానే హీరోయిన్లు కూడా సిగరెట్లు తాగే ట్రెండ్ కి శ్రీకారం చుట్టాను అని మనీషా కొయిరాలా తాజాగా తెలిపారు.
“హీరోలు ఏమి చేసినా నడుస్తుంది. హీరోయిన్లు మాత్రం ఒక పద్దతిగా ఉండాలి అని అప్పట్లో చెప్పేవాళ్ళు. ద్వంద్వ ప్రమాణాలు నాకు నచ్చేవి కావు. అందుకే నేను కొన్ని పనులు కావాలనే చేశాను. అవి మంచి అలవాట్లు కాదు అని తెలుసు కానీ ఆడవాళ్లను ఒక తీరుగా, మగవాళ్ళను ఒక తీరుగా చూసే పద్దతికి నిరసనగా అవి చేశా,” అని మనీషా కొయిరాలా తెలిపారు.
“ధూమపానం, మద్యపానం ‘హీరోయిక్’గా చూసేవాళ్ళు. అదే హీరోయిన్ చేస్తే విమర్శించేవారు. దాంతో నేను అవి చేయడం ప్రారంభించాను. నేను కొంతవరకు తిరుగుబాటు చేశా. కావాలంటే నేను సెట్లో సిగరెట్లు తాగడం ప్రారంభించాను,” అని వివరించారు.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…