అన్నీ అనుకుంటే జరగవు.. కొన్ని అలా జరుగుతాయంతే. ఏదో సినిమాలో త్రివిక్రమ్ చెప్పినట్టు
ఓ పెద్ద విషయం కళ్ల ముందు నడుస్తున్నప్పుడు మనం గుర్తించం, అది చరిత్రకెక్కిన తర్వాత మనం ప్రత్యేకంగా గుర్తించాల్సిన అవసరం లేదు. ‘కార్తికేయ-2’ కూడా అలాంటిదే.
ఇదేదో పాన్ ఇండియా లెవెల్లో పెద్ద హిట్టయిపోతుందని తీయలేదు. నమ్మిన కథను, వంద శాతం నిజాయితీగా తెరకెక్కించారు. ఏ పాత్రకు ఎవరు అవసరమో వాళ్లనే తీసుకున్నారు. టైమ్ కలిసొచ్చింది, ‘కార్తికేయ-2’ నార్త్ బెల్ట్ లో కూడా సూపర్ హిట్టయింది.
మళ్లీ ఇన్నేళ్లకు ఆ సినిమా దర్శకుడు చందు మొండేటి నుంచి మరో మూవీ వస్తోంది. ఈసారి కూడా పాన్ ఇండియాపై కన్నేశాడు ఈ దర్శకుడు. అదే ‘తండేల్’ సినిమా.
సక్సెస్ అనేది ఎవ్వరి చేతిలో లేదు. ఎవరైనా గట్టిగా ప్రయత్నించడం వరకే. ఈసారి ‘తండేల్’తో చందు మొండేటి కూడా అదే చేస్తున్నాడు. ‘కార్తికేయ-2’కు ఎంత కష్టపడ్డాడో, ‘తండేల్’కు కూడా అంతే కష్టపడ్డాడు.
హిట్ పడితే మాత్రం బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా విజయాలు అందించిన ప్రశాంత్ నీల్, సుకుమార్ లాంటి దర్శకుల సరసన ఇతడు కూడా చేరిపోతాడు. పనిలోపనిగా నాగచైతన్య కూడా పాన్ ఇండియా హీరో అయిపోతాడు.
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…
జాన్వీ కపూర్ (Janhvi Kapoor)ని "పెద్ది" సినిమాలో చూపించిన విధానం, ఆమె పాత్ర చిత్రీకరణ విషయంలో రేగిన గోల నేపథ్యంలో…
అందాల నిధి (Nidhhi Agerwal)కి పేరుకు తగ్గట్టుగానే అందాల గని ఉంది. కానీ ఆమెకు ఆవగింజంత అదృష్టం కూడా లేదు.…