హీరోయిన్ గా కెరీర్ కొనసాగించాలనుకునే భామలు హీరోలతో సన్నిహితంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. తెరపై హీరోతో తమ కెమిస్ట్రీ చాలా బాగుందని చెప్పుకొస్తారు. లిప్ కిస్సులు, ఎక్స్ పోజింగ్ పై తమ అభిప్రాయాలు చెబుతుంటారు. నిహారిక కొణెదల మాత్రం దీనికి పూర్తి భిన్నంగా మాట్లాడుతోంది.
టాలీవుడ్ లో తనకు 11 మంది అన్నయ్యలు ఉన్నారంటోంది నిహారిక. రామ్ చరణ్, వరుణ్ తేజ్ కాకుండా.. నితిన్ కూడా తనకు అన్నయ్యే అంటోంది. మరోవైపు రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్ శర్వానంద్ కూడా తనకు అన్నయ్య లాంటివాడే అంటోంది.
అలా పరిశ్రమలో తనకు 11 మంది హీరోలు అన్నయ్యల్లా కనిపిస్తారని, వాళ్ల పక్కన హీరోయిన్ గా తను నటించలేనని చెప్పుకొచ్చింది. ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇస్తే రావాల్సిన అవకాశాలు కూడా రావంటున్నారు ఇండస్ట్రీ జనాలు.
మరోవైపు నిహారిక మాత్రం తన సినీ కెరీర్ పై ఆశాభావంతో ఉంది. తాజాగా ఆమె తెలుగులో ఓ సినిమాకు సైన్ చేసింది. అక్టోబర్ నుంచి ఆ సినిమా సెట్స్ పైకి వస్తుందట. ఓవైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు నిర్మాతగా సినిమాలు తీస్తానంటోంది నిహారిక.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…