పవన్ కల్యాణ్ సినిమాలపై కొనసాగుతున్న అనిశ్చితి అంతా ఇంతా కాదు. ఆయన ఎప్పుడు సెట్స్ పైకి వస్తారో తెలియదు, ఆయన సినిమాలు ఎప్పుడు థియేటర్లలోకి వస్తాయో చెప్పలేని పరిస్థితి. ఇలాంటి టైమ్ లో పవన్ కల్యాణ్ కు ప్రత్యేక విన్నపం చేస్తున్నారు ఆయన ఫ్యాన్స్.
ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. వీటిలో 2 సినిమాలు దాదాపు ఫినిషింగ్ స్టేజ్ లో ఉన్నాయి. ఆ రెండు సినిమాల్ని పూర్తిచేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. అటుఇటుగా 3 వారాలు టైమ్ ఇస్తే, ఆ రెండు సినిమాలు పూర్తయిపోతాయని, దయచేసి సినిమాలకు ఓ 3 వారాలు టైమ్ కేటాయించాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.
‘హరిహర వీరమల్లు’ సినిమా దాదాపు పూర్తయింది. ఓ బ్లాక్ షూటింగ్ మాత్రమే పెండింగ్. అది పూర్తయితే మార్చి 28కి సినిమా వస్తుంది, లేదంటే కష్టమే. ఇక ‘ఓజీ’ సినిమా యూనిట్ కూడా పవన్ కోసం వెయిటింగ్. 2 వారాలు కాల్షీట్లు కేటాయిస్తే ఆ సినిమా షూట్ పూర్తవుతుందనే టాక్ ఉంది.
అందుకే పవన్ ఫ్యాన్స్ ఇలా ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఓ 3 వారాలు కేటాయించి, ఆ 2 సినిమాలు పూర్తిచేస్తే, థియేటర్లలో పండగ చేసుకుంటామని అంటున్నారు
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…