Categories: న్యూస్

అరవింద్ కు నచ్చకపోయినా తీస్తా

గీతా కాంపౌండ్ ను బన్నీ వాస్ ను విడదీసి చూడలేం. అల్లు ఫ్యామిలీలో అంతర్భాగం బన్నీ వాసు. అరవింద్, అల్లు అర్జున్ మాట కాదని బన్నీ వాస్ ఏ పని చేయరు. కానీ ఈసారి లెక్క మారబోతోంది. అరవింద్ కు నచ్చకపోయినా సినిమాలు తీస్తానంటున్నాడు బన్నీ వాస్.

“నా వ్యక్తిగత అభిరుచికి తగ్గ కథలు కొన్ని ఉన్నాయి. అవి అరవింద్ గారికి నచ్చవు. ఇంతకుముందు ఏంటంటే, ఆయనకు నచ్చకపోతే నేను తీసేవాడ్ని కాదు. కానీ ఇకపై ఆయనకు చెప్పి, ఆయన వద్దన్నా కూడా నాకు నచ్చిన సినిమాలు నేను నిర్మించుకుంటాను.”

స్వయంగా బన్నీ వాస్ చెప్పిన మేటర్ ఇది. ఆల్రెడీ వయసైపోతోందని, ఇప్పటికైనా తన మనసుకు నచ్చిన సినిమాలు నిర్మించుకుంటానని ఆయన ప్రకటించడం విశేషం. ఈ సందర్భంగా మరో ఊహాగానంపై కూడా ఆయన క్లారిటీ ఇచ్చాడు.

బన్నీ వాసు, గీతాఆర్ట్స్ కు దూరమౌతున్నాడనే ప్రచారం జరిగింది ఆమధ్య. అలాంటిదేం లేదని.. అరవింద్ కు, తనకు ఉన్న బాండింగ్ మధ్య అసలిలాంటి ప్రశ్నే తలెత్తదని క్లారిటీ ఇచ్చాడు బన్నీ వాస్. ప్రస్తుతం తామిద్దరం గీతా ఆర్ట్స్ కు సంబంధించి వ్యవస్థను బిల్డ్ చేసే పనిలో ఉన్నామని..  అరవింద్ తర్వాత తను, తన తర్వాత వేరే వ్యక్తిని రెడీ చేయాలని అన్నాడు.

Admin

Recent Posts

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

13 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

13 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

13 hours ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

14 hours ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

18 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

2 days ago