టాలీవుడ్ లో ఆమెను దేవతగా చూశారు. ఫ్లాప్స్ ఇచ్చిన తర్వాత విమర్శించినా హద్దులు దాటలేదు. కానీ కోలీవుడ్ లో వ్యవహారం ఇంత పద్ధతిగా ఉండదు. వాళ్ల ట్రీట్ మెంట్ ఎలా ఉంటుందో పూజా హెగ్డే స్వయంగా ఇప్పుడు ఫేస్ చేస్తోంది.
సూర్య సరసన ‘రెట్రో’ సినిమా చేసింది పూజాహెగ్డే. ఆ సినిమా కాస్తా తెలుగులో అట్టర్ ఫ్లాప్ అయింది. తమిళ్ లో ఓ మోస్తరుగా ఆడింది, మంచి వసూళ్లు కూడా తెచ్చుకున్నప్పటికీ, సూర్య ఫ్యాన్స్ కు ఆ విజయం సరిపోలేదు.
ఆ మాటకొస్తే సూర్య కూడా ‘రెట్రో’ విజయంపై ఏమంత సంతృప్తిగా లేడు. ఉన్నంతలో ‘కంగువా’తో పోలిస్తే చాలా బెటర్ అనే ఫీలింగ్ లోకి వెళ్లిపోయాడు. సూర్య అభిమానులకు మాత్రం ఆ ఫీలింగ్ లేదు.
తాజా చిత్రం ఫెయిలవ్వడానికి పూజాహెగ్డేను కారణం అని వాళ్లు మెంటల్లీ బాగా ఫిక్స్ అయిుపోయారు. దీంతో సోషల్ మీడియాలో పూజాహెగ్డేపై ఓ రేంజ్ లో ట్రోలింగ్ షురూ చేశారు. గడిచిన 3 రోజులుగా నడుస్తున్న ఈ ట్రోలింగ్ ఎంత దారుణంగా ఉందంటే, ఆమెను మరో సినిమాలో తీసుకోవడానికి ఏ తమిళ హీరో అయినా ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే.
అక్కినేని అఖిల్ (Akhil Akkineni), జైనబ్ (Zainab Ravdjee) 2025 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి జరిగిన వెంటనే ఈ…
రవితేజ (Ravi Teja) కథానాయకుడిగా నటిస్తున్న ‘ఇరుముడి’ (Irumudi) చిత్రంపై ఇటీవల సోషల్ మీడియాలో నెలకొన్న సందేహాలకు తెరపడింది. బుక్‌మైషోలో…
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ నిజమైన బ్లాక్‌బస్టర్ అని నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ధీరజ్ మొగిలినేని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మూడు ఏరియాల్లో…
దర్శకుడు ఎం.ఎస్. రాజు రూపొందిస్తున్న కొత్త చిత్రం ‘అగధ’ (Agadha). ఈ సినిమా ప్రచార కార్యక్రమాలకు టీం ఆదివారం ఘనంగా…
ధనుష్ (Dhanush) హీరోగా ఆర్ టేక్ స్టూడియోస్, వండర్‌బార్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న భారీ చిత్రానికి ‘ఓం: చాప్టర్ 1’…
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…