పూజ హెగ్డేకి కెరీర్ దాదాపుగా ముగిసింది. ఆమెకి తెలుగులో గత రెండేళ్లలో ఒక్క ఆఫర్ రాలేదు. ఐతే, లక్కీగా ఆమెకి తమిళంలో మూడు, నాలుగు బడా సినిమాలు దక్కాయి. అందులో మొదటిది… రెట్రో. సూర్య హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా రూపొందిన ‘రెట్రో’ మే 1న విడుదలైంది. తెలుగులో దారుణంగా పరాజయం పాలైంది.
తమిళంలో ఈ సినిమాకి మిశ్రమ స్పందన దక్కింది. ప్లాప్ కాదు అలాగనీ బ్లాక్ బస్టర్ కాదు. ఓపెనింగ్ కలెక్షన్స్ బాగున్నాయి. దీని పూర్తి ఫలితం సోమవారం తర్వాతే తేలుతుంది.
ఈ సినిమా ఆడకపోతే సూర్యకి దెబ్బే కానీ సూర్య కన్నా పూజ హెగ్డేకి పెద్ద సమస్య అవుతుంది. ఐతే, ఆమె కూడా సోమవారం తర్వాత ఫలితం ఎలా ఉంటుందో చూడాలని అనుకుంటోంది.
వచ్చే జనవరికి ఆమె నటించిన “జన నాయగన్” విడుదల అవుతుంది. ఇందులో విజయ్ హీరో. విజయ్ కి ఇదే చివరి చిత్రం. ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ ఉంటుంది. అందుకే “జన నాయగన్”పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాపై ఆమె ఆశలు పెట్టుకోవచ్చు.
నిజానికి “రెట్రో” చిత్రంలో డీగ్లామ్ పాత్రలో పూజ బాగా ఒదిగిపోయింది. ఇప్పటివరకు ఆమె చేసిన పాత్రలకు భిన్నంగా కనిపించింది. నటిగా కూడా మెప్పించింది. కానీ ఫలితం మాత్రం అనుకున్నంతగా దక్కలేదు.
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…
సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…
నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…
తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో 'యానిమల్',…