హీరోయిన్ రాశీ ఖన్నా (Raashi Khanna) టాలీవుడ్, బాలీవుడ్ లో వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. రీసెంట్ గా ఆమె ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలో కూడా మెరిసింది. ఇలా ఎంత బిజీగా ఉన్నప్పటికీ, ఆమె తన రోజువారీ వర్కవుట్లను మాత్రం అస్సలు మిస్ అవ్వదు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా తన ఫిట్‌నెస్ సీక్రెట్స్, మానసిక ప్రశాంతత గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది రాశీ ఖన్నా. రాశీ ఖన్నాకు వర్కవుట్ చేయడం అనేది ఒక థెరపీ లాంటిదట. ఇది తన జీవితంలోని నెగటివిటీని దూరం చేసి, మనసుకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని చెబుతోంది.
ఫిట్‌నెస్ అనేది కేవలం బయటకు కనిపించే లుక్ కోసమే కాదని, అది మన ఆలోచనా విధానాన్ని, ప్రతిరోజూ మనం ఫీల్ అయ్యే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందని చెబుతోంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ట్రెండ్స్ గురించి కూడా స్పందించింది.
ఫిట్ నెస్ విషయంలో సోషల్ మీడియా ట్రెండ్స్‌ను గుడ్డిగా నమ్మి, ఇతరులతో మిమ్మల్ని మీరు పోల్చుకోవద్దని సలహా ఇస్తోంది రాశి. కేవలం సన్నగా మారడం కంటే శరీరాన్ని బలంగా, ఆరోగ్యంగా మార్చుకోవడంపైనే దృష్టి పెట్టాలని సూచిస్తోంది. రోజుకో చిన్న అడుగు వేస్తూ ఏదో ఒక శారీరక శ్రమను అలవాటు చేసుకోవాలని ఆమె కోరుతోంది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…