జూనియర్లు వంద టేకులు తీసుకున్న సందర్భాలున్నాయి. ఇక కొత్తగా ముఖానికి రంగేసుకున్న నటీనటుల సంగతైతే చెప్పనక్కర్లేదు. షెడ్యూల్స్ కూడా అయిపోతుంటాయి. కానీ ఒక సీనియర్ మోస్ట్ నటుడు 78 టేకులు తీసుకున్నాడంటే కచ్చితంగా అది వార్తే. ‘పెద్ది’ సినిమా సంగతి ఇది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బొమన్ ఇరానీ (Boman Irani) కనిపించనున్నారు.
‘పెద్ది’ ట్రయిలర్ లో కూడా ఆయనకు చోటు దక్కింది. పాత్ర చిన్నదే అయినప్పటికీ, ఇంటెన్సిటీ చాలా పెద్దది. ఇంకా చెప్పాలంటే, చరణ్ పోషించిన పెద్ది పాత్రను ఎలివేట్ చేసేది బొమన్ ఇరానీ పాత్రే.
ఈ సినిమాలో కీలకమైన ఓ డైలాగ్ ఉంది. పెద్ది పాత్రను అమాంతం పైకి లేపే డైలాగ్ అది. ఆ డైలాగ్ ఎన్నిసార్లు చెప్పినా ఓకే అవ్వడం లేదు. బుచ్చిబాబు తృప్తిచెందడం లేదు. అప్పటికే 20 టేకులు అయిపోయాయి. మరోవైపు లైట్ ఫెయిల్ అయిపోతోంది.
బుచ్చిబాబు కాంప్రమైజ్ అవ్వలేదు, బొమన్ ఇరానీ అస్సలు తగ్గలేదు. డైలాగ్ చెబుతూనే ఉన్నారు. అలా 78 సార్లు డైలాగ్ చెప్పారు. 78వ సారి చెప్పిన డైలాగ్ ఓకే అయింది. హీరో గురించి చెప్పే క్రాస్ ఓవర్ అధ్లెట్ డైలాగ్ అది.
ఇలాంటి సందర్భాల్లో ఏ నటుడిగైనా దర్శకుడిపై కోపం రావడం సహజం. కానీ బొమన్ మాత్రం బుచ్చిబాబు తపన, నిబద్ధత చూసి ముచ్చటపడ్డారు. చూడ్డానికి బక్కగా కనిపించినా, అతడి విజన్ చాలా పెద్దది అంటూ మెచ్చుకున్నారు ఇరానీ.
నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…
కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…
లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…
ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…
తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…