షారుఖ్ నటించిన ‘జవాన్’ చిత్రంతో హిందీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది నయనతార (Nayanthara). ఆ సినిమాలో తన స్టైలిష్ యాక్షన్ సీన్స్‌తో అందరినీ మెప్పించిన ఆమె, ఇప్పుడు సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సరికొత్త చిత్రంలో కూడా యాక్షన్ లుక్ లో కనిపించనుంది.
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ సినిమాలో నయనతార కేవలం గ్లామర్‌కే పరిమితం కాకుండా, కీలకమైన ఎపిసోడ్ లో యాక్షన్ మోడ్ లో కూడా కనిపించబోతోందంట.
దీనికి సంబంధించి ఆల్రెడీ ఓ షెడ్యూల్ పూర్తయినట్టు తెలుస్తోంది. నిపుణుల సమక్షంలో నయనతారపై కొన్ని యాక్షన్ సన్నివేశాలు తెరకెక్కించారట. త్వరలోనే మరో షెడ్యూల్ లో నయనతారపై ఈ ఎపిసోడ్ ను కొనసాగిస్తారని తెలుస్తోంది.
షూటింగ్ సెట్స్‌లో సల్మాన్, నయనతారల మధ్య మంచి బాండింగ్ ఏర్పడిందని, వీరిద్దరి స్క్రీన్ కెమిస్ట్రీ ప్రేక్షకులను కచ్చితంగా నచ్చుతుందని మేకర్స్ చెబుతున్నారు.
ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా, కుల్దీప్ రాథోడ్ సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం 2027 రంజాన్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సినిమాకు అనిరుధ్, తమన్ కలిసి వర్క్ చేస్తారనే ప్రచారం సాగుతోంది.
రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…
మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…
మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…
సమంత పరీక్షలో 100 మార్కులతో పాస్ అయింది. మూడేళ్ళ గ్యాప్ తర్వాత వెండితెరపైకి వచ్చిన సమంతకి తెలుగు జనం "మా…
ప్రస్తుతం సౌత్ లో మోస్ట్ హ్యాపెనింగ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan). 'బ్లాస్ట్' (Blast) సక్సెస్ తర్వాత ఈమె…
ప్రభాస్ ఒక్కో సినిమాకు 150 కోట్లు తీసుకుంటాడు. బన్నీ కూడా ఈమధ్య ఆ రేంజ్ దాటి వెళ్లాడని టాక్ ఉంది.…