రాశి ఖన్నా (Raashi Khanna) కెరీర్ కి తెలుగులో మళ్ళీ ఊపు వచ్చింది అని భావించేలోపే ఆమె మళ్ళీ సైలెంట్ అవ్వాల్సిన పరిస్థితిలో పడింది. గతేడాది తెలుసు కదా (Telusu Kada) సినిమాలో సిద్ధూకి భార్యగా నటించింది. అది ఫ్లాప్ అయింది. తాజాగా పవన్ కళ్యాణ్ సరసన చిన్న పాత్ర పోషించింది. ఇదీ కలిసిరాలేదు.
“ఉస్తాద్ భగత్ సింగ్”లో ఆమె చివరి నిమిషంలో చేరింది. పెద్ద పాత్ర కాదు అని తెలిసినా పవన్ కళ్యాణ్ సరసన నటించాలనే ఉద్దేశంతో సినిమా చేసింది. ఈ సినిమాలో ఆమె పాత్ర అనుకోకుండా మాయం అవుతుంది. అంటే ఆమె పాత్రకు సరైన ముగింపు కూడా లేదు. కేవలం పవన్ కళ్యాణ్ సరసన నటించాలనే లక్ష్యంతో చేసినా అది కూడా సరైన రిజల్ట్ ఇవ్వలేదు.
ఇక రాశి ఖన్నాకి కొత్తగా ఏ తెలుగు సినిమాలో అవకాశం వస్తుందో చూడాలి.
ఆమె చేతిలో వెబ్ సిరీస్ లు, కొన్ని హిందీ తమిళ ప్రాజెక్ట్స్ మాత్రం ఉన్నాయి. త్వరలో “ఫర్జీ 2” వెబ్ సిరీస్ తో మన ముందుకు రానుంది. అక్షయ్ కుమార్ సరసన ఒక హిందీ సినిమాలో నటిస్తోంది. తమిళంలో “రౌడీ అండ్ కో” అనే సినిమా చేస్తోంది. తెలుగులో “ఉస్తాద్ భగత్ సింగ్” ఆడి ఉంటే వెంటనే మరో అవకాశం వచ్చేది.
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…
ఒక నటిగా కెరీర్‌లో ఎదురయ్యే ఒడిదొడుకులు, కష్టకాలమే ఓపికను, తనపై తనకు నమ్మకాన్ని నేర్పించిందని చెబుతోంది హీరోయిన్ త్రిప్తి దిమ్రి…