హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Srinivas), కావ్య రెడ్డి (Kavya Reddy)కి సంబంధించి రోఖా ఫంక్షన్ (నిశ్చితార్థం లాంటిదే కానీ) ఇటీవలే జరిగింది. ఇక ఇప్పుడు సాంప్రదాయ పద్దతిలో నిశ్చితార్థం ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ ఎంగేజ్ మెంట్ ని గ్రాండ్ గా చేస్తారట.
కానీ పెళ్లి మాత్రం నిరాడంబరంగా జరుగుతుందట. ఏప్రిల్ 29న తిరుపతిలో వీరి వివాహ వేడుకని నిర్వహిస్తారు. పెళ్లిని సింపుల్ గా కానిచ్చి మే 1న హైదరాబాద్‌లో ఒక భారీ విందు (రిసెప్షన్) ఇస్తారట.
బెల్లంకొండ శ్రీనివాస్, కావ్యరెడ్డి చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆమె విదేశాల్లో చదువుకొని వచ్చింది. ఆమె ఇష్టప్రకారం తిరుపతిలో సింపుల్ గా వివాహ వేడుకని నిర్వహించనున్నారు.
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రస్తుతం “టైసన్ నాయుడు” అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ కొన్నేళ్లుగా సా….గుతోంది. ఎప్పుడు విడుదల అవుతుందో చూడాలి. ఎందుకంటే ఈ సినిమాని నిర్మిస్తున్నది “అఖండ 2” నిర్మాతలు. ఆ సినిమానే ఆర్థిక ఇబ్బందుల కారణంగా విడుదల విషయంలో గందరగోళం చేశారు.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…