అవీ ఇవీ

Bro 2: బ్రో.. మళ్లీ వద్దు బ్రో!

పవన్ కళ్యాణ్, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి నటించిన “బ్రో” (Bro) సినిమా 2023లో విడుదలైంది. నటుడు, దర్శకుడు సముద్రఖని ఈ సినిమాని తీశారు. ఆ సినిమా ఘోరంగా ఫ్లాప్ అయింది. పవన్ కళ్యాణ్ నటించినా ఆ సినిమాకి కనీస ఓపెనింగ్ కూడా రాలేదు.

అది తీసిపారేసే సినిమా కాదు కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ లేని ఆ చిత్రం అభిమానులకు నచ్చలేదు. సామాన్య ప్రేక్షకులు అటువైపు చూపే వెయ్యలేదు.ఇక తాజాగా “ఉస్తాద్ భగత్ సింగ్” నిరాశ పర్చడంతో అభిమానులు పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలపై ఒక కచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. పవన్ కళ్యాణ్ కొంచెం కమర్షియల్ గా క్రేజ్ ఉన్న దర్శకులతోనే సినిమాలు చెయ్యాలి అనేది వారి డిమాండు.

ఐతే, తాజాగా సముద్రఖని తన తమిళ్ చిత్రాన్ని ప్రమోట్ చేసుకుంటున్నాడు. ఆ సినిమా ప్రమోషన్ ఇంటర్వ్యూలలో “బ్రో” సినిమాకి సీక్వెల్ (Bro 2) తీస్తాను అని ప్రకటించాడు.

“నా దగ్గర బ్రో సీక్వెల్ కథ, స్క్రిప్ట్ రెడీగా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే చాలు మొదలుపట్టేస్తా,”అని సముద్రఖని అన్నారు.

దాంతో, వద్దు బ్రో, మీ స్క్రిప్ట్ వద్దు, మీ సినిమా వద్దు, మా హీరో దగ్గరికి అసలే వెళ్లొద్దు అని సోషల్ మీడియాలో సముద్రఖనిని ట్రోల్ చేస్తున్నారు.

TeluguCinema

Recent Posts

నా ఫిట్ నెస్ సీక్రెట్ అదే: Kajal Aggarwal

పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…

8 hours ago

Bhagyashri Borse: ఒక్క విజయం 2 కోట్ల భాగ్యం

భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…

17 hours ago

Prince Cecil: వైవాహిక బంధంలోకి మరో నటుడు

సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఒక్కొక్కరుగా పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. బ్రహ్మచారి జీవితానికి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదే బాటలో తాజాగా…

17 hours ago

Nabha Natesh: రెండు సినిమాలపై ఆశలు, ఒకటి పోయింది

నభా నటేష్ (Nabha Natesh) ఈ ఏడాది రెండు భారీ సినిమాలపై ఆశలు పెట్టుకొంది ఒకటి నాగబంధం (Nagabandham), మరోటి…

1 day ago

Sri Gouri Priya: తెలుగు భామకి తెలుగులో కెరీర్ ఊపు వచ్చేనా

శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు అమ్మాయి. ఇప్పటికే తెలుగులో 'మ్యాడ్' చిత్రంలో నటించింది. తమిళంలో…

1 day ago

Rashmika Mandannaకి వీరితో జోడి కుదిరేనా?

తెలుగులో పాన్ ఇండియా స్థాయిలో పాపులారిటీ ఉన్న భామ… రష్మిక మందాన (Rashmika Mandanna) మాత్రమే. బాలీవుడ్ లో  'యానిమల్',…

1 day ago