న్యూస్

Peddi: ఏప్రిల్ 30 డేట్ మార్పు లేదు

నిన్న హీరో రామ్ చరణ్ (Ram Charan) ‘పెద్ది’ (Peddi) సినిమా షూటింగ్ లో గాయపడ్డాడు. గచ్చిబౌలి స్టేడియంలో కీలకమైన సన్నివేశాలు తీస్తున్నప్పుడు చిన్న ప్రమాదం జరిగి కంటిపై భాగంలో దెబ్బ తగిలింది. దాంతో రామ్ చరణ్ ని రెండు రోజుల విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారట . చిన్న దెబ్బె కావడంతో యధావిధిగా షూటింగ్ లో పాల్గొనేందుకు రామ్ చరణ్ సిద్ధమయ్యాడు.

ALSO READ: Mishap for Ram Charan during Peddi shoot, actor safe

నిన్న రామ్ చరణ్ కి దెబ్బలు తగిలాయి అన్న వార్త గుప్పుమనడంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది, విడుదల పోస్ట్ పోన్ అయింది అని ప్రచారం మొదలైంది. ఐతే, అలాంటిదేమి లేదు అని తాజాగా తెలుస్తోంది. ఈ సినిమాని ఏప్రిల్ 30న విడుదల చేస్తున్నారు.

అమెరికాలో ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రీమియర్ కానుంది. ప్రీమియర్ షో టికెట్ల అమ్మకాలు రేపటి నుంచి మొదలవుతున్నాయి. ఈ టికెట్ అమ్మకాల డేట్ లో ఎలాంటి మార్పు లేదు అని డిస్ట్రిబ్యూటర్ ప్రకటించారు. అంటే సినిమా విడుదలలో ఈ చేంజ్ లేనట్లే.

పెద్ది సినిమాని బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నాడు. ఇతను ఇంతకుముందు ఉప్పెన సినిమా తీశాడు. అతనికి ఇది రెండో చిత్రం. రామ్ చరణ్ ఈ సినిమాలో రకరకాల క్రీడల్లో పాల్గొనే గ్రామీణ కుర్రాడిగా కనిపిస్తాడు. ఊరి బాగు కోసం పోరాడే పెద్ది అనే పాత్రలో నటిస్తున్నాడు. రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ ని అనుకుంటున్నారట.

TeluguCinema

Recent Posts

Rukmini Vasanth: సూపర్ స్టార్ సినిమాలో ‘కాంతార’ బ్యూటీ

రుక్మిణి వసంత్ (Rukmini Vasanth)కి అన్నీ పెద్ద ప్రాజెక్ట్ లే దక్కుతున్నాయి. ఇప్పటికే యష్ సరసన "టాక్సిక్" సినిమా పూర్తి…

12 minutes ago

తల్లి కావాలనే కల ఇప్పటిది కాదు: Samantha

నటి సమంత (Samantha) ఇటీవలే తాను గర్భవతి అని వెల్లడించారు. తల్లి కాబోతున్న విషయాన్ని మీడియా ద్వారా, సోషల్ మీడియా…

20 hours ago

Trivikram Srinivas: కోసం బ్రేస్ లెట్ అమ్మిన కమెడియన్

కెరీర్ ప్రారంభంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) పడిన కష్టాలు గురించి కొన్ని మాత్రమే బాహ్య ప్రపంచానికి తెలుసు. మరీ…

20 hours ago

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

20 hours ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

21 hours ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

1 day ago