దర్శకుడు మురుగదాస్ హిందీలో మరో బడా మూవీ తీయబోతున్నాడు అనే వార్త వచ్చినప్పుడు అందులో హీరోయిన్ గా మొదట వినిపించిన పేరు… సమంత. సల్మాన్ ఖాన్ సరసన సమంత అంటూ మీడియాలో హెడ్ లైన్స్ వచ్చాయి.
కానీ ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సల్మాన్ ఖాన్ హీరోగా మురుగదాస్ తీస్తున్న “సికిందర్” సినిమాలో హీరోయిన్ సమంత కాదు. మన నేషనల్ క్రష్ రష్మిక మందాన నటించనుంది. ఈ రోజు మేకర్స్ రష్మిక పేరుని అధికారికంగా ప్రకటించారు. అంటే సమంతకి వెళ్లకుండా ఈ బడా ప్రాజెక్ట్ రష్మిక ఖాతాలోకి వచ్చింది.
ALSO READ: Rashmika Mandanna bags Salman Khan’s ‘Sikindar’
సమంత పేరు ఇటీవల పలు బాలీవుడ్ పెద్ద సినిమాల్లో వినిపించింది. అందులో ఒక్కటీ కూడా నిజం కాలేదు. ప్రచారం జరిగిన వాటిలో వేరే హీరోయిన్లు వచ్చి చేరుతున్నారు. తాజాగా ‘సికిందర్’లో రష్మిక పేరు ప్రకటించడంతో అసలు సమంతకి ఒక్క పెద్ద బాలీవుడ్ చిత్రమైనా వస్తుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.
ఇక ఆమె తెలుగులో సొంత నిర్మాణ సంస్థలో ఒక సినిమా చేస్తోంది. “మా ఇంటి బంగారం” అనే ఒక సినిమాని నిర్మిస్తూ నటిస్తోంది సమంత.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…