Categories: న్యూస్

‘కృష్ణమ్మ’ మంచి సినిమా ఫీలింగ్ నిస్తుంది!

సత్యదేవ్, అతిరా రాజ్, అర్చన నటించిన “కృష్ణమ్మ” మే 10న విడుదల కానుంది. ఈ సినిమా మంచి తృప్తినిచ్చింది అంటోంది టీం.

హీరో సత్యదేవ్

సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూశామనే ఫీలింగ్ తో వస్తారని నమ్మకం ఉంది. దర్శకుడికి తొలి సినిమా అంటున్నారు. కానీ మేకింగ్ మాత్రం పది సినిమాలు చేసిన డైరెక్టర్ లా చేశారు. ఇలాంటి కథను నాకు ఇచ్చినందుకు తనకు నేను రుణపడి ఉంటాను. తనకు ఈ సినిమాకు తొలి మెట్టు మాత్రమే. తను భవిష్యత్తులో ఇంకా గొప్ప సినిమాలు చేస్తారు. మా నిర్మాత కృష్ణగారు ప్యాషన్‌తో కృష్ణమ్మ సినిమా చేశారు. ఆయనకు థాంక్స్. కొరటాల శివగారు లేకపోతే ఈ సినిమాకు ఇంత బజ్ వచ్చేది కాదు. ఆయనకు థాంక్స్. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ గొప్ప సంగీతాన్ని ఇచ్చారు.

హీరోయిన్ అర్చన

విజువల్ ఎమోషనల్ మూవీగా నచ్చుతుంది. పద్మ అనే పాత్రకు నేను సూట్ అవుతాననిపించి అవకాశం ఇచ్చిన మా నిర్మాత కృష్ణగారికి, దర్శకుడు గోపాలకృష్ణగారికి థాంక్స్. సత్యదేవ్‌గారు చాలా మంచి కో ఆర్టిస్ట్.

హీరోయిన్ అతిరా రాజ్

నాతో పాటు నటించిన సత్యదేవ్ గారికి, అర్చనకు అందరికీ థాంక్స్. ఈ సినిమా మీకు నచ్చుతుంది.

దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ

కొరటాలగారు నాలుగు గంటల పాటు కథ విని ఓకే చేశారు. ఆయనకు విజయవాడ గురించి బాగా తెలుసు. ఆయనే ఆశ్చర్యపొయేలా కొత్త విజయవాడను ఈ సినిమాలో చూపించాం. ఇందులో బెజవాడ పాలిటిక్స్, రౌడీలు కనిపించరు. బెజవాడ కుర్రాళ్లలోని రుబాబుతనం, అమాయకత్వం బేస్ చేసుకుని కథను రాశాం. కృష్ణా నది ఎప్పుడు పుట్టింది, ఎలా పుట్టిందనేది ఎవరికీ తెలియదు. అలాగే ఈ సినిమాలో హీరో, అతని ఫ్రెండ్స్ ఎలా పుట్టారనేది తెలియదు. అనాథలు. అలాగే కృష్ణమ్మ ప్రహించేటప్పుడు ఎన్ని మలుపులు తీసుకుంటుందో.. హీరో అతని ఫ్రెండ్స్ జీవితాలు అన్ని మలుపులు తిరుగుతాయి. అందుకనే ఈ సినిమాకు కృష్ణమ్మ అనే టైటిల్ పెట్టాం.

Admin

Recent Posts

హీరోయిన్ నుంచి డబ్బులు తీసుకున్న Kiran Abbavaram

'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…

10 hours ago

Anandhi Ajay: నన్ను ఎందుకు తీసేశారు, నటి ఆవేదన

తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…

15 hours ago

Sakkshi Mhadolkar: శ్రీ విష్ణు సరసన ‘మౌగ్లీ’ ముద్దుగుమ్మ

సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…

19 hours ago

Toxic నిర్మాత: పెద్దల కోసమని చెప్పాం, ట్రోలింగ్ ఎందుకిక?

'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…

2 days ago

Posani Krishna Murali: ఒక ఆర్టిస్టును నమ్మి పూర్తిగా మోసపోయా!

పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…

2 days ago

Janhvi Kapoor పవర్‌ డ్రెస్సింగ్‌ పై ఒకటే చర్చ!

భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…

2 days ago