సమంత ఏ చిన్న స్టేట్ మెంట్ ఇచ్చినా దానికి చాలా పబ్లిసిటీ వస్తుంది. తన వ్యక్తిగత జీవితంతో కావొచ్చు లేదా సినిమాలు/ఓటీటీ ప్రాజెక్టుల వల్ల కావొచ్చు, సమంతకు ఇంకా పాపులారిటీ ఉంది. తాజాగా ఆమె చేసిన మరికొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
సక్సెస్ అంటే కేవలం గెలవడం కాదంటోంది సమంత. చిత్తశుద్ధితో ప్రయత్నించడం కూడా సక్సెస్ లో భాగమేనని చెబుతోంది. అవార్డులు, రివార్డులు వస్తేనే సక్సెస్ కాదని, మనకు నచ్చినట్టు బతకడం కూడా పెద్ద సక్సెస్ అంటోంది సమంత.
సిడ్నీలో ఓ కార్యక్రమంలో పాల్గొంది సమంత. ఈ సందర్భంగా ఈ స్టేట్ మెంట్ ఇచ్చింది. తనకు రూల్స్ పెడితే అస్సలు నచ్చదని, తనకు నచ్చినట్టు తన లైఫ్ ఉండాలని తెలిపింది. ఇష్టమైన రంగంలో రాణించాలని, ఆడపిల్ల అని చెప్పి కట్టుబాట్లు పెట్టకూడదని అంటోంది.
ప్రస్తుతం ఆమె ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ చేస్తోంది. మరోవైపు ఆమె నిర్మాతగా మారి ప్రొడ్యూస్ చేసిన సినిమా ఒకటి దాదాపు సిద్ధమైంది. త్వరలోనే ఆ సినిమా ప్రచారంతో సమంత, తెలుగు మీడియా ముందుకురానుంది.
ఒకే సినిమాతో హీరోకి, హీరోయిన్ కి విషమ పరీక్ష ఎదురుకావడం అరుదు. "లెనిన్" (Lenin) సినిమా విషయంలో అదే జరుగుతోంది.…
ఒకప్పుడు తన స్పెషల్ సాంగ్స్, ఎనర్జిటిక్ డ్యాన్స్‌లతో కుర్రకారును ఉర్రూతలూగించిన ముమైత్ ఖాన్ (Mumait Khan), ఒకప్పుడు తన జీవితంలోని…
లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాస రావు (Singeetam Srinivasa Rao) 94 ఏళ్ల వయసులో తెరకెక్కించిన చిత్రం "సింగ్ గీతం"…
పెద్ది సినిమాలో జాన్వి కపూర్ పాత్ర చిత్రీకరణపై సోషల్ మీడియాలో రకరకాల వ్యాఖ్యానాలు కనిపిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని నేరుగా…
హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) మరో డిఫరెంట్ రోల్ లోకి షిఫ్ట్ అయినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆమె పోలీస్…
దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) గత కొన్నేళ్లుగా కేరళలో కన్నా హైదరాబాద్ లో ఎక్కువగా ఉంటున్నాడు. తాను నటించే మలయాళ…