నిజంగా సమంత అభిమానులకు ఇది చేదువార్త. ఆమె నుంచి సీక్వెల్ వస్తుందని భావించారు కానీ ఇప్పుడా సీక్వెల్ రద్దయింది. ఇదంతా “సిటాడెల్-హనీబన్నీ” మేటర్.
అమెజాన్ ప్రైమ్ వీడియోస్ పై ఈ యాక్షన్ సిరీస్ చేసింది సమంత. సీజన్-2 కోసం ఆమె ఫ్యాన్స్ వెయిటింగ్. అయితే ఈ సిరీస్ కు సంబంధించి రెండో సీజన్ లేదని ప్రకటించింది అమెజాన్.
సిటాడెల్ ఒరిజినల్ లో ప్రియాంక చోప్రా నటించింది. దాని స్పిన్-ఆఫ్ వెర్షన్ సమంత చేసింది. అదే విధంగా “సిటాడెల్-డయానా” పేరిట ఇటాలియన్ వెర్షన్ కూడా ఉంది. ఇప్పుడీ ఇటాలియన్ వెర్షన్ తో పాటు, ఇండియన్ వెర్షన్ ను నిలివేస్తున్నట్టు ప్రకటించింది అమెజాన్.
ఇకపై ఒకే ‘సిటాడెల్’ ఉంటుందని, అన్ని ప్రపంచ భాషల్లో అది రిలీజ్ అవుతుందని ప్రకటించింది. ప్రియాంక నటిస్తున్న “సిటాడెల్ పార్ట్-2” వచ్చే ఏడాది స్ట్రీమింగ్ కు రాబోతోంది.
మరోవైపు ‘ఫ్యామిలీమేన్’ కొత్త సినిమాలో కూడా సమంత లేదు. అలా రెండు పెద్ద వెబ్ సిరీస్ ల నుంచి సమంత తప్పుకున్నట్టయింది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘రక్త్ బ్రహ్మాండ్’ అనే సిరీస్ మాత్రమే ఉంది.
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…
రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…
రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…