వరుస సంగీత విభావరులతో ఊపుమీదున్న దేవిశ్రీ ప్రసాద్ కు విశాఖ పోలీసులు బ్రేకులేశారు. మరో 2 రోజుల్లో వైజాగ్ లో జరగనున్న మ్యూజికల్ నైట్ కు అనుమతి నిరాకరించారు. ఒకసారి, రెండు సార్లు కాదు, ఏకంగా 4 సార్లు అనుమతి నిరాకరించడంతో కన్సర్ట్ జరగడం కష్టమనే టాక్ నడుస్తోంది.
ఇలాంటి టైమ్ లో ఉన్నఫలంగా వైజాగ్ లో ల్యాండ్ అయ్యాడు దేవిశ్రీ. అతడు తన షో కోసమే వైజాగ్ చేరుకున్నాడు. ఓవైపు అనుమతి దొరక్కుండా, దేవిశ్రీ వైజాగ్ లో ల్యాండ్ అవ్వడం చర్చనీయాంశంగా మారింది.
పోర్ట్ స్టేడియంలో ఈవెంట్ పెట్టుకున్నారు. దాని కెపాసిటీ 3వేలు మాత్రమే, నిర్వహకులు మాత్రం 10వేల టికెట్లు అమ్ముకున్నారు. దీంతో పర్మిషన్ రాలేదు. ఈ నేపథ్యంలో, వేదిక మారుస్తారా లేక పోలీసులతో మరోసారి చర్చిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది.
కొన్ని రోజుల కిందట విశాఖలోనే ఓ స్పోర్ట్స్ స్విమ్మింగ్ సెంటర్ లో బాలుడు మృతి చెందాడు. అప్పట్నుంచి పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో ఎదురుకాని సమస్య, దేవిశ్రీకి విశాఖలో ఎదురైంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…