గత నెలలో విడుదలైన “అఖండ 2″తో సంయుక్త మీనన్ కి భారీ ఫ్లాప్ దక్కింది. మొదటిసారి పక్కా మాస్ సినిమాలో నటించి, “జాజికాయ” అంటూ ఒక మాస్ సాంగ్ కూడా చేస్తే జనం తిప్పికొట్టారు. బాలయ్యతో నటించిన ఈ సినిమా ఆమెకి చేదు అనుభవం మిగిల్చింది. ఇప్పుడు మరో సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అదే “నారి నారి నడుమ మురారి.”
శర్వానంద్ హీరోగా నటించిన ఈ సినిమాలో ఆమె ఒక హీరోయిన్. మరో హీరోయిన్ గా సాక్షి వైద్య నటించింది. ఐతే, ఈ సినిమాలో అసలు హీరోయిన్ సంయుక్తనే. ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. పూర్తిగా వినోదాత్మక పద్దతిలో తీసిన ఈ సినిమాపై ప్రస్తుతం పెద్దగా అంచనాలు లేవు. కానీ, సాధారణంగా సంక్రాంతికి విడుదల అయ్యే సినిమాల్లో పెద్ద చిత్రాల కన్నా పెద్దగా అంచనాలు లేని సినిమాలే హిట్ అవుతుంటాయి.
గతంలో శర్వానంద్ నటించిన “శతమానం భవతి” అలాగే భారీ హిట్ అయింది. ఇప్పుడు కూడా అదే రిపీట్ అవుతుంది అని శర్వానంద్ ఆశ. సంయుక్తకి ఇప్పుడు అదే టెన్షన్. ఈ సినిమా అయినా తనని గట్టెక్కిస్తుందా అనేది ఆమె టెన్సన్.
అన్నట్లు సంయుక్త నటించిన మరో సినిమా “స్వయంభు” వచ్చే నెల విడుదల కానుంది. అంటే డిసెంబర్ లో “అఖండ 2”, జనవరి లో “నారి నారి నడుమ మురారి”, ఫిబ్రవరిలో “స్వయంభు”. ఒక్కో నెల ఒకటి. ఒక దాని ఫలితం వచ్చింది. కనీసం ఈ రెండోది అయినా హిట్ ఐతే కొంచెం రిలీఫ్.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…