2026 సంక్రాంతికి విడుదల అవుతున్న సినిమాలు ఇవి: 1) ది రాజా సాబ్ 2) మన శంకర వరప్రసాద్ గారు 3) భర్త మహాశయులకు విజ్ఞప్తి 4) అనగనగా ఒక రాజు 5) నారి నారి నడుమ మురారి. ఈ సినిమాల్లో మూడు సినిమాలకు చెందిన దర్శకుల గురించి అందరికీ తెలుసు.
మారుతి (ది రాజా సాబ్), అనిల్ రావిపూడి (మన శంకర వరప్రసాద్ గారు), కిషోర్ తిరుమల (భర్త మహాశయులకు విజ్ఞప్తి) దర్శకులుగా ఇంతకుముందే హిట్స్ ఇచ్చారు. వారి ప్రతిభ అందరికీ తెలుసు. నారి నారి నడుమ మురారి.ఇక శర్వానంద్ హీరోగా రూపొందిన “నారి నారి నడుమ మురారి”కి దర్శకుడు రామ్ అబ్బరాజు. ఈ దర్శకుడు ఇంతకుముందు “సామాజ వరాగమనా” “వివాహ భోజనంబు” సినిమాలు తీశాడు. అతనికి దర్శకుడిగా ఒక గుర్తింపు ఉంది.
ఈ ఐదు సినిమాల్లో దర్శకుడు ఎవరో తెలియని చిత్రం.. అనగనగా ఒక రాజు.
ఈ సినిమా దర్శకుడు (మారి) ఎవరో జనాలకు తెలియదు. టీం కూడా అతన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. అంతా తానే అని హీరో నవీన్ పోలిశెట్టి వ్యవహరిస్తున్నాడు. నిర్మాత నాగవంశీ కూడా అలాగే మాట్లాడుతున్నాడు. నవీన్ గురించి అందరికీ తెలుసు తానే రాసుకుంటాడు, తానే ఘోస్ట్ డైరెక్ట్ చేసుకుంటాడు. ప్రమోషన్లు కూడా తానే ప్లాన్ చేసుకుంటాడు. అందుకే ఈ సినిమా దర్శకుడు ఎవరో కూడా తెలియకుండానే పోతోంది.
సినిమా ప్రియులకు అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చేసింది! థియేటర్లలో భారీ వసూళ్లతో పాటు ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న రెండు సూపర్…
సమంత (Samantha) గర్భవతి అన్న వార్తని తెలుగుసినిమా.కామ్ సహా అన్ని మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఆమె బేబీ బంప్…
ఇప్పుడు కాదు, సమంత(Samantha)కు ఎప్పుడూ పిల్లలంటే ఇష్టమే. ఒక దశలో పెళ్లయిన కొద్ది నెలలకే ఆమె తల్లి కావాలనుకుంది. మాతృత్వంపై,…
"ఇరుముడి" (Irumudi) కోసం రవితేజ (Ravi Teja), దర్శకుడు శివ నిర్వాణ (Shiva Nirvana) జతకట్టారు. ఇది రవి తేజ…
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎప్పుడు ఏ సినిమాకి ఓకె చెప్తారో, ఎప్పుడు షూటింగ్ కి రెడీ అంటారో, ఎప్పుడు…
గ్లామర్ డాల్‌గా, లవ్లీ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రాళ్ల మనసులు దోచుకున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (Priyanka Mohan) ఇప్పుడు తన కెరీర్‌లోనే…