దీపిక పదుకోను అడిగిన పారితోషికం, ఆమె పెట్టిన డిమాండ్లు అర్థంపర్థం లేనివి. అందులో అనుమానం లేదు. ఐతే పారితోషికం విషయంలో బేరం చేసుకుంటే తగ్గేదేమో. ఆమె ఆ రేంజ్ లో అడిగింది అని హర్ట్ అయిన సందీప్ రెడ్డి వంగా ఏకంగా ఒక వర్ధమాన తారని ఆమె స్థానంలో తీసుకున్నాడు.
ప్రభాస్ హీరోగా నటించే “స్పిరిట్”లో త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. త్రిప్తికి ఇది పెద్ద ఛాన్స్. ఆమె గాల్లో తేలుతోంది సంతోషంతో. త్రిప్తికి అందం ఉంది, టాలెంట్ ఉంది. కానీ దీపికలా స్టార్డం లేదు, రాలేదు ఇంకా.
మరి, దీపిక వద్దనుకుంటే అలియా భట్టో, శ్రద్ధ కపూరో, ప్రియాంకా చోప్రానో తీసుకోవచ్చు. లేదు జాన్వికపూర్, రష్మిక మందానని కూడా అనుకోవచ్చు. కానీ ఇంకా స్టార్డం లేని హీరోయిన్ ని ఎంచుకున్నాడు సందీప్ రెడ్డి. దానికి కారణం దీపికపై బుద్ది చెప్పడమే అని అంటోంది బాలీవుడ్ మీడియా.
ALSO READ: It’s official: Tripti Dimri cast opposite Prabhas in Spirit
సందీప్ రెడ్డి వంగాకి కోపం ఎక్కువ. పట్టుదల ఎక్కువ. చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ అతనిది. చాలా అగ్రెస్సివ్ గా ఉంటాడు. అందుకే, దీపిక డిమాండ్స్ తో హార్ట్ అయిన సందీప్ ఇప్పుడు తాను త్రిప్తి డిమ్రితో కూడా దీపిక స్థానాన్ని రీప్లేస్ చెయ్యగలను అని నిరూపించాలని భావిస్తున్నాడు.
హీరో, దర్శకుడు, డ్యాన్స్ కొరియోగ్రాఫర్ ఇలా అనేక విధాలుగా పాపులర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence). "ముని", కాంచన సినిమాల…
మహేష్ బాబు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన 'గుంటూరు కారం' (Guntur Kaaram) సినిమా గురించి ఇప్పుడు ప్రత్యేకంగా…
పూజ హెగ్డే (Pooja Hegde)కి ఇప్పుడు లక్ తిరిగినట్టు కనిపిస్తోంది. ఆమెకి హిట్స్ లేవు కానీ వరుసగా అవకాశాలు వస్తూనే…
ఈ రోజు అల్లరి నరేష్ (Allari Naresh) పుట్టిన రోజు. దాంతో, నరేష్ కొత్త సినిమా "రంభ ఊర్వశి మేనక"…
విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…
సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…