ప్రభాస్ హీరోగా నటించిన సలార్ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా చేసింది. పేరుకు ఆమె హీరోయిన్ అయినప్పటికీ సినిమాలో ఆమె పాత్ర నిడివి మాత్రం చాలా తక్కువ. దీనికి సంబంధించి ఆమెపై చాలా కామెంట్స్ వినిపించాయి. హీరోయిన్ రోల్ గా చెప్పుకునే ఇలాంటి అతిథి పాత్రలు చేయాల్సిన అవసరం ఏముందని చాలామంది ప్రశ్నించారు.
‘సలార్’లో తన పాత్ర నిడివిపై పూర్తి స్పష్టత ఇచ్చింది శృతిహాసన్. ఓ మంచి వంటకం తయారవ్వాలంటే అందులో అన్నీ సమపాళ్లలో ఉండాలని, ‘సలార్’లో తన పాత్ర కూడా అంతేనని స్పష్టం చేసింది. పైగా సూపర్ హిట్ అవుతుందని మనసుకు అనిపించినప్పుడు ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తోంది.
“ఓ సినిమాకు సంతకం చేసేటప్పుడు చాలా అంశాల్ని లెక్కలోకి తీసుకుంటాను. సలార్ లో నా పాత్ర నిడివి తక్కువగా ఉందని నేను కంప్లయింట్ చేయను. ఎందుకంటే, ఓ మంచి వంటకం తయారవ్వాలంటే అన్నీ అందులో సమపాళ్లలో ఉండాల్సిందే. ఓ పెద్ద సినిమా తెరకెక్కుతున్నప్పుడు వాటిలో ఏవి ఎక్కువ ఉండాలి, ఏవి తక్కువ ఉండాలనేది దర్శకుడు నిర్ణయం తీసుకుంటాడు. పైగా ఓ సినిమా సూపర్ హిట్ అవుతుందని మన మనసుకు తెలుస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి.”
తను కొన్ని సినిమాల్లో ఫుల్ లెంగ్త్ పాత్రలో కనిపించానని, కానీ అలాంటి కొన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని.. మరికొన్ని సినిమాల్లో చిన్న రోల్స్ చేసినప్పటికీ పెద్ద హిట్టయ్యాయని తెలిపింది శృతిహాసన్.
ఇవన్నీ గేమ్ లో భాగమని.. హిట్ సినిమాలో ఉండాలంటే కొన్ని త్యాగాలు చేయాల్సిందేని అంటోంది. తన పాత్ర నిడివి కంటే, సినిమాలో కమర్షియాలటీ ఉందా లేదా అనేది చూస్తానంటోంది శృతి.
ప్రీతి ముకుందన్ (Preity Mukhundhan) ... తెలుగులో ఆమె మొదటి సినిమా 'కన్నప్ప'. అలాగే ఆమె నటించిన 'బ్లాస్ట్' (Blast)…
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక యాదగిరిగుట్ట (Yadagiri Gutta) లక్ష్మీనరసింహస్వామి ఆలయ నూతన ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ జారీ చేసిన…
'నాగబంధం' (Nagabandham) సినిమాలో నటీనటులు చిన్నవాళ్లు. దర్శకుడు కూడా కొత్త. మొన్నటివరకు అంచనాలు కూడా తక్కువే. ఎప్పుడైతే ట్రయిలర్ రిలీజైందో,…
బాలీవుడ్ నటి నేహా ధూపియా (Neha Dhupia) ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో పాపరాజీపై అసహనం వ్యక్తం చేశారు. ఫొటోగ్రాఫర్లు…
"యానిమల్" చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన త్రిప్తి దిమ్రి (Tripti Dimri) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రస్తుతం…
హీరోయిన్ కాయదు లోహర్ (Kayadu Lohar) తన పాఠశాల రోజుల్లో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని బయటపెట్టింది. పదో తరగతి చదువుతున్న…