ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్” మూడేళ్ళ పాటు షూటింగ్ జరిపిన తర్వాత విడుదల అవుతోంది. ఈ సంక్రాంతి కానుకగా వచ్చే వారం (జనవరి 9న) విడుదల కానుంది. ఒకటి విడుదలవుతోంది. మరోటి ఈ ఏడాది చివర్లో రావడం పక్కా.
దర్శకుడు హను రాఘవపూడి తీస్తున్న “ఫౌజీ” షూటింగ్ సగభాగం పూర్తి అయింది. ఈ సినిమాని ఆగస్టు 15న విడుదల చెయ్యాలా లేక డిసెంబర్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతున్నారు. 2026లో విడుదల కావడం మాత్రం పక్కా.
ఈ రెండు సినిమాలు ఈ ఏడాది విడుదల ఐతే వచ్చే ఏడాది “స్పిరిట్” సినిమా వస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తీస్తున్న “స్పిరిట్”కి ఇంకా డేట్ ఫిక్స్ చెయ్యలేదు. కానీ వచ్చే ఏడాది విడుదల అవుతుంది.
ప్రభాస్ ఇంతకుముందు చాలా సినిమాలు ఒప్పుకున్నాడు. ఇప్పుడు అన్నీ స్ట్రీమ్ లైన్ అవుతున్నాయి. 2026లో గతంలో ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి అవుతాయి. ఇంకా కొత్తగా రెండు సీక్వెల్స్ మొదలుపెట్టాలి. ఒకటి కల్కి 2, రెండోది సలార్ 2.
వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…
ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…
చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…
హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…
తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…
సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…