న్యూస్

పవన్ కళ్యాణ్: మనీ? మాట?

అధికారంలో లేనప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్ లకు టైంకి వచ్చేవాడు కాదు. ఎక్కువ గ్యాప్ తీసుకునేవాడు. అధికారంలో లేనప్పుడే సినిమాలపై అంత ఆసక్తి చూపకుండా రాజకీయంపై ఫోకస్ పెట్టినప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటాడని చాలామంది భావించారు. ఐతే, ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నెరవేరుస్తూనే అడపాదడపా సినిమాలు చేస్తాను అని తెలిపారు.

ఐతే, ఆయన సడెన్ గా మరో సినిమా ప్రకటించడం, అదీ కూడా ఆగిపోయింది అనుకున్న సురేందర్ రెడ్డి సినిమాకి ఓకె చెప్పడంతో ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. 2026లోనే కాదు, 2027లో కూడా సినిమాలు విడుదలయ్యేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకుంటున్నారు అని టాక్ మొదలైంది.

2026లో “ఉస్తాద్ భగత్ సింగ్” రిలీజ్ అవుతుంది. ఇదే ఏడాది సురేందర్ రెడ్డి సినిమా సెట్ మీదకి వెళ్తే వచ్చే ఏడాది అది కూడా విడుదల అవుతుంది. ఈ సినిమాతో పాటు మరో సినిమా కూడా త్వరలోనే ప్రకటిస్తారు అని టాక్. KVN ప్రొడక్షన్స్ కి ఒక సినిమా ఒప్పుకున్నారు పవన్ కళ్యాణ్.

ALSO READ: వేసవిలో వస్తున్నాడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’

ఐతే, పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సినిమాలు సైన్ చేస్తోంది మనీ కోసమా? మాట కోసమా? సురేందర్ రెడ్డి సినిమాకి రామ్ తాళ్లూరి నిర్మాత. రామ్ తాళ్లూరి జనసేనకు ఆర్థికంగా చాలా సాయం చేశారు. సో, అతనికి సినిమా చెయ్యడం గురించి అర్థం చేసుకోవచ్చు. KVN ప్రొడక్షన్స్ కి, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి మరో సినిమా చేసేందుకు అంగీకరించారంటే పూర్తిగా మనీ కోసమే అని చెప్పొచ్చు.

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

3 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

6 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

1 day ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

2 days ago