
వేసవి సెలవుల్లో బాక్సాఫీస్ వద్ద హల్చల్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh). హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన “గబ్బర్ సింగ్” మే నెలలో విడుదలయింది. ఈ భగత్ సింగ్ ఏప్రిల్ లో వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.
నిర్మాతలు ఇంకా విడుదల డేట్ ప్రకటించలేదు. కానీ ఇప్పటికే సినిమా ప్రచారం మొదలుపెట్టారు. మొదటి పాట విడుదలయింది. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త పోస్టర్ విడుదల చేస్తూ వేసవిలో విడుదల అని ప్రకటించారు.
ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీసు అధికారిగా నటిస్తున్నారు. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా కనిపిస్తారు.
2025లో పవన్ కళ్యాణ్ రెండు సినిమాలు విడుదల చేస్తే “ఓజీ” బాగా ఆడింది. ఈ ఏడాది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా కూడా తీసుకొచ్చేలా ఉన్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాని తాజాగా ప్రకటించారు.
