విద్యాబాలన్ గొప్ప నటి. ఎలాంటి పాత్రలలోనైనా అద్భుతంగా ఒదిగిపోగలదు. హిందీ, తెలుగు సినిమాల్లో నటించిన ఈ భామ ఇప్పుడు ఎక్కువగా తన వయసుకు తగ్గ పాత్రలు చేస్తోంది. ఒకప్పుడు సిల్క్ స్మిత పాత్రలో రెచ్చిపోయి గ్లామర్ ఒలకబోసిన విద్యాబాలన్ ఆ తర్వాత లావు కావడంతో అలాంటి పాత్రలకు, ఫోటోషూట్ లకు దూరంగా ఉంది.
ఐతే, ఈ 46 ఏళ్ల భామ చాలా కస్టపడి చాలా బరువు తగ్గింది. మళ్ళీ మంచి ఫిట్నెస్ పొందింది. ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అదరగొడుతోంది.
ఇక నటిగా కూడా తన ఆకలి తగ్గలేదు అంటోంది. నటిగా మరిన్ని మంచి పాత్రలు, సినిమాలు చెయ్యాలనే కసి ఉంది అని చెప్తోంది.
“నేను సరైన సమయంలో సరైన సినిమాలు చేశాను. నాకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను. నేను ఎప్పుడూ పని కోసం చూసేదాన్ని. ఎదో చెయ్యాలని కసి, ఆకలి అప్పుడు ఎక్కువ. అందుకే అన్ని వైవిధ్యమైన పాత్రలు చేశాను. ఇప్పటికీ అదే కోరిక ఉంది. చేసే పనిని నిజంగా ప్రేమిస్తాను. ప్రతిరోజూ నటిగా జీవించడం అదృష్టంగా భావిస్తున్నాను. 20 సంవత్సరాల కెరీర్ పూర్తి అయింది. ఇప్పటికీ మొదట్లో ఉన్నంత ఉత్సాహంగా ఉన్నాను,” అని విద్యాబాలన్ అంటోంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…