“హరి హర వీర మల్లు” సినిమాని దర్శకుడు క్రిష్ నాలుగేళ్ల క్రితం మొదలు పెట్టాడు. కానీ పవన్ కళ్యాణ్ రకరకాల కారణాల వల్ల, తన రాజకీయ కార్యకలాపాల వల్ల షూటింగ్ ని వాయిదా వేస్తూ వచ్చారు. దాంతో ఆ సినిమా అలా సాగుతూ వెళ్ళింది. ఈ క్రమంలో సినిమాని స్పీడ్ గా పూర్తి చేసేందుకు క్రిష్ ఒక ఐడియా వేశాడు. సినిమాని రెండు భాగాలుగా మార్చితే మొదటి భాగం త్వరగా పూర్తి చెయ్యొచ్చు అని అనుకున్నాడు. అయితే, క్రిష్, పవన్ కళ్యాణ్ కి కొన్ని విషయాల్లో విభేదాలు వచ్చాయి. దాంతో అతను తప్పుకున్నాడు.
క్రిష్ వదిలేసిన ప్రాజెక్టు ని ఎ.ఎం. రత్నం కొడుకు జ్యోతికృష్ణ పూర్తి చేశాడు. కొన్ని మార్పులు చేసి ఇప్పుడు విడుదలకు రెడీగా ఉంచాడు. ఈ నెల 24న విడుదల కానుంది ‘హరి హర వీర మల్లు – పార్ట్ 1’. మరి రెండో భాగం ఉంటుందా?
“ఉంటుంది. ఇప్పటికే 20 నిమిషాల షూటింగ్ పూర్తి అయింది,” అని హీరోయిన్ నిధి అగర్వాల్ చెప్తోంది.
నిధి అగర్వాల్ మాట ఎలా ఉన్నా… రెండో భాగం పూర్తి కావాలంటే పవన్ కళ్యాణ్ రాజకీయాలు, ఆయన షెడ్యూల్స్ అవీ చాలా లెక్కలు వేసుకోవాలి. ఈ మొదటి భాగం పూర్తి చెయ్యడానికి నిర్మాత రత్నంకి చుక్కలు కనపడ్డాయి.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…