Naga Chaitanya’s Vrushakarma – Budget and details: నాగ చైతన్య నటిస్తోన్న భారీ చిత్రం.. వృషకర్మ (Vrushakarma). ఈ సినిమా స్టార్ట్ ఇప్పటికే ఏడాది అవుతోంది. గత ఏడాది ఫిబ్రవరిలో “తండేల్” సినిమా విడుదలైంది. ఆ సినిమాకి ముందే విరూపాక్ష దర్శకుడితో సినిమా సైన్ చేశాడు నాగ చైతన్య. ప్రముఖ నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్, అయన కుమారుడు బాపినీడు నిర్మాణంలో ఈ సినిమా మొదలైంది.
ఈ సినిమాకి “వృషకర్మ” అనే పేరుని ఖరారు చేశారు. భారీ సెట్లు, భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందుతున్న ఈ సినిమాకి ముందు అనుకున్న బడ్జెట్ 75 కోట్లు. కానీ అది ఇప్పటికే 100 దాటింది అని సమాచారం. అదే ఇప్పుడు సమస్యగా మారింది.
రెండేళ్ల క్రితం ఉన్న పరిస్థితులు వేరు, ఇప్పటి సీన్ వేరు. ఇప్పుడు ఓటిటి కంపెనీలు పెద్ద అమౌంట్స్ ఇవ్వడం లేదు. దాంతో, “వృషకర్మ” బడ్జెట్ ని రాబట్టుకోవాలంటే కనీసం సగం అయినా ఓటిటి నుంచి రావాలి. ఇప్పుడు అదే భయం మొదలైంది నిర్మాతకు.
ఇవన్నీ పేరుకే పాన్ ఇండియా చిత్రాలు కానీ హిందీ, ఇతర భాషల్లో ఆడితేనే పాన్ ఇండియా సినిమా అని చెప్పాలి. పేరుకి పాన్ ఇండియా అని చెప్పి ఇప్పుడు తెలుగు మార్కెట్ నుంచే 95 శాతం వసూళ్లు కోసం ప్రయత్నిస్తున్నారు నిర్మాతలు.
నాగ చైతన్య హిందీ సినిమాలో నటించాడు. కానీ అతనికి ఇప్పటివరకు పాన్ ఇండియా మార్కెట్ రాలేదు. “తండేల్” తెలుగులో తప్ప ఎక్కడా ఆడలేదు. తెలుగులో కూడా అమెరికా మార్కెట్ లో ఫ్లాప్ అయింది. అందుకే, ఈ సినిమా బడ్జెట్ పెరిగిపోవడంతో నిర్మాతకు భయం మొదలైంది అని టాక్.
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…
తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రంగా తెరకెక్కిన 'జన నాయకుడు' (తమిళంలో 'జన నాయగన్') ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు…
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…