అవీ ఇవీ

Varanasi: వారణాసి టికెట్ ధర ఎంత?

Varanasi movie: రాజమౌళి డైరెక్షన్లో మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న “వారణాసి” సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. ఏప్రిల్ 7, 2027న రిలీజ్ కానుంది అని ఇప్పటికే టీం చెప్పింది. అంటే రిలీజ్ కి ఇంకా ఏడాదికి పైనే టైం ఉంది. కానీ అప్పుడే ఈ సినిమా బిజినెస్ ని క్లోజ్ చేసే పనిలో పడింది టీం. నిర్మాత కె. ఎల్. నారాయణ ఇప్పటికే డిస్ట్రిబ్యూటర్లతో బేరాలు మొదలుపెట్టారు.

“వారణాసి” నైజాం హక్కులు దాదాపు 150 నుంచి 200 కోట్ల రూపాయల మధ్య అడుగుతున్నారు. ఒక అగ్ర నిర్మాత 150 కోట్లకు కోట్ చేస్తే మరో అగ్ర నిర్మాత 175 వరకు ఇచ్చేందుకు రెడీ అయ్యారట.

కానీ, అంత బిజినెస్ అవుతుందా? ఇప్పటివరకు “ఆర్ ఆర్ ఆర్” మినహా ఏ సినిమా కూడా నైజాంలో 120 కోట్లకు పైగా థియేటర్ రెవెన్యూ (షేర్) సాధించలేదు. మరి 150 కోట్లు పెట్టి సినిమా డిస్ట్రిబ్యూషన్ హక్కులు కొంటే షేర్ అంతకన్నా ఎక్కువ రావాలి. అప్పుడు థియేటర్ టికెట్ రేట్ 2000కి పెట్టాలి.

ప్రస్తుతం టికెట్ రేట్లను 450 నుంచి 600 మధ్య అమ్ముతున్నారు పెద్ద సినిమాలకు మొదటి వారం. కానీ “వారణాసి”కి ఇప్పటి నుంచే హైప్ క్రియేట్ చేసి 2000 టికెట్ రేట్ కి ప్రభుత్వాలని ఒప్పిస్తారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

TeluguCinema

Recent Posts

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

6 hours ago

Bloody Romeo: నాని సినిమా ఆగలేదు, మొదలు ఎప్పుడంటే

ఒక వైపు "ఓజీ 2" (OG 2) సినిమా హడావిడి జరుగుతోంది. రోజుకో ఆప్డేట్ ఇస్తోంది టీం. దాంతో అందరిలో…

9 hours ago

OG 2: కొత్త సినిమాకి కొత్త పాటల సిట్టింగ్ షురూ

చూస్తుంటే "ఓజీ 2" (OG 2) సినిమా పనులు స్పీడ్ అందుకుంటున్నాయి. ఇప్పటికే సంగీత చర్చలు మొదలయ్యాయి. తాజాగా సంగీత…

1 day ago

Rhea Chakraborty: తోడు కావాలి కానీ ఇప్పుడు కాదు

హీరోయిన్ రియా చక్రవర్తి (Rhea Chakraborty) తన రిలేషన్‌షిప్ స్టేటస్ గురించి బయటపెటింది. ప్రస్తుతం తాను సింగిల్‌గా ఉన్నానని వెల్లడించింది.…

1 day ago

K Bhagyaraj కథలతో వెంకటేష్ బ్లాక్ బస్టర్లు

తమిళ దర్శకుడు కె. భాగ్యరాజా ఇక లేరు. ఆయనని అప్పట్లో వన్ మేన్ స్టూడియో అని పిలిచేవారు. ఎందుకంటే ఆయనే…

2 days ago

Maa Inti Bangaaram: రెండేళ్ల తర్వాత రెండో భాగం

సమంత (Samantha) నటించిన "మా ఇంటి బంగారం" (Maa Inti Bangaaram) పెద్ద హిట్ అయింది. అందరి అంచనాలను తలకిందులు…

2 days ago