The Raja Saab: ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోన్న చిత్రం…. ది రాజాసాబ్. తాజాగా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చింది. దాంతో ఇంతకుముందు చూడని వాళ్ళతో పాటు థియేటర్లో చూసిన వాళ్ళూ ఈ సినిమాని ట్రోలింగ్ చెయ్యడం మొదలుపట్టారు.
అసలు ఈ మధ్య కాలంలో ఒక సినిమాకి ఇంత ట్రోలింగ్ జరగలేదు. దానికి కారణం సినిమా బాగాలేకపోవడం, చాలా బోరింగ్ గా ఉండడం ఒక్కటే రీజన్ కాదు. దర్శకుడు మారుతి (Maruthi) చేసిన అతి కూడా కారణాల్లో ఒకటి.
సినిమా ముందు ఒక రేంజ్ లో మాట్లాడాడు మారుతి. ప్రభాస్ ఫ్యాన్స్ ఊగిపోతారు అన్నట్లుగా చెప్పాడు. అస్సలు తన డైరెక్షన్ ని చూసి ఇతర పెద్ద హీరోలు వెంట పడుతారు, ప్రభాస్ చాలా గ్లామరస్ గా ఉంటాడు అన్నట్లుగా చెప్పాడు. అంతే కాదు, రిలీజ్ అయిన మర్నాడు విమర్శించిన వాళ్లపై, క్రిటిక్స్ పై కామెంట్స్ చేశాడు. ఏదైనా కొత్త చిత్రం, కొత్త కథ తీసినప్పుడు త్వరగా అర్థం కాక, ఇలాంటివి కామెంట్స్ వస్తాయని, రెండు రోజుల్లో అన్ని సర్దుకుంటాయని అన్నాడు. కానీ ఇప్పుడు ఓటిటిలో సినిమా చూసిన వాళ్ళు మారుతిని తెగ తిడుతున్నారు. ఇందులో కొత్తదనం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు.
అలాగే ప్రభాస్ ని గ్లామర్ గా చూపించడం అంటే బాడీ డబుల్ ని ఉపయోగించి, ఆ ఫేస్ లో ప్రభాస్ ఫేస్ ని ఇరికించడమా అని గట్టిగా అడుగుతున్నారు ఫ్యాన్స్.
ది రాజాసాబ్ సినిమా థియేటర్లో విడుదలైనప్పుడు ఎదురుకొన్న కామెంట్స్ కన్నా ఇప్పుడు ఎక్కువ ట్రోలింగ్ ఫేస్ చేస్తోంది.
హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రలో నటించిన సరికొత్త సస్పెన్స్…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో హడావిడిగా విడుదల తేదీ ప్రకటించి కనీసం రెండు, మూడు సార్లు విడుదల తేదీని వాయిదా వేసే…
రామ్ చరణ్ పై తనకున్న అభిమానాన్ని ఇప్పటికే చాటుకున్నాడు అఖిల్ (Akhil Akkineni). తాజాగా ఎన్టీఆర్ తో తన అనుబంధాన్ని…
తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' (Jana Nayagan) రిలీజ్…
పెళ్లయి, బాబుకు తల్లి అయినప్పటికీ, ఇప్పటికీ సన్నజాజి తీగలా మెరిసిపోతోంది కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal). కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం…
భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి ఐదు సినిమాల తర్వాత మొదటి విజయం దక్కింది. ఒక్క సినిమా హిట్ కాకపోయినా అనేక…