Categories: ఫీచర్లు

వీరి ఖాతాలో అనేక చిత్రాలు!

నాని స్పీడ్ గా సినిమాలు చేస్తాడని పేరు. అందుకే, ఒక సినిమా సెట్ పై ఉండగానే మరో రెండు సినిమాలు డిస్కషన్లో నడుస్తుంటాయి. అలా ఉంటుంది ఆయన ప్లాన్. ఒకప్పుడు రవితేజ కూడా అలాగే ఉండేవారు. కానీ రవితేజ జోరు ఇప్పుడు తగ్గింది.

నాని ప్రస్తుతం “సరిపోదా శనివారం” అనే సినిమా షూటింగ్ లో ఉన్నారు. అది ఆగస్టులో విడుదల అవుతుంది. ఆ తర్వాత నాని చెయ్యబోయే సినిమాలు ఇవే.

  1. దసరా 2
  2. సుజీత్ డైరెక్షన్లో మూవీ
  3. ఎల్లమ్మ (బలగం వేణు డైరెక్షన్)
  4. జైభీమ్ డైరెక్టర్ తో సినిమా

ఇక పెద్ద హీరోలు ఎవరూ ఇలా ఒకేసారి మూడు సినిమాలు లైన్లో ఉంచేందుకు ఇష్టపడరు. కానీ ప్రభాస్ మాత్రం నానిని మించిపోయారు ఈ విషయంలో. ప్రభాస్ నటించిన “కల్కి” త్వరలోనే విడుదల కానుంది. ఈ సినిమా తర్వాత ప్రభాస్ చెయ్యబోయే చిత్రాలు నాలుగు. అవును మూడు సినిమాలు స్టార్ట్ కాబోతున్నాయి, ఒకటి ఇప్పటికే షూటింగ్ దశలో ఉంది.

ప్రభాస్ చేస్తున్న చిత్రాలు ఇవే.

  1. ది రాజా సాబ్ (ఇది ఆల్రెడీ షూటింగ్ జరుగుతోంది)
  2. సలార్ 2 (త్వరలోనే షూటింగ్ మొదలు)
  3. హను రాఘవపూడి డైరెక్షన్లో మూవీ
  4. స్పిరిట్ (సందీప్ వంగ చిత్రం)

ఇలా ప్రభాస్, నాని ఇద్దరూ నాలుగు కొత్త సినిమాలతో తమ లైనప్ ని సెట్ చేసుకున్నారు. ఈ సినిమాలన్నీ వచ్చే వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది విడుదల అవుతాయి. అంటే 2026 వరకు ప్రభాస్, నాని తమ సినిమాలను ఫిక్స్ చేసుకున్నారు. ఇక కొత్తగా ఎవరైనా వీరితో సినిమా చేయాలంటే 2027, 28 గురించి ఆలోచించాలి.

Admin

Recent Posts

Bhagyashri Borse: కొత్తగా కథలు వింటున్నాను

లెనిన్ (Lenin) తర్వాత భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse) తెలుగులో ఏ సినిమా చెయ్యబోతుంది? మొన్నటి వరకు ఆమెని ఐరన్…

8 minutes ago

NTR: ‘పొలిటికల్ పుకార్ల’ వలయంలో చిక్కుకున్న డ్రాగన్

ఎన్టీఆర్ కి రాజకీయాలు కొత్త కాదు. 2009లోనే ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం చేశారు. ఐతే, ఆ తర్వాత…

56 minutes ago

Naga Durga: ఎన్నో కండీషన్లు, అయినా అవకాశాలు!

తెలుగులో "ఇడుపు కాయితం" (Idupu Kayitham) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది యూట్యూబ్ సంచలనం నాగదుర్గ (Naga Durga).…

5 hours ago

Ram Gopal Varma: నాగ్ మీద ఒట్టు అఖిల్ బెస్ట్

రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) ఏం మాట్లాడినా, ఏ ట్వీట్ వేసినా అది పీక్స్ లో ఉంటుంది.…

1 day ago

Prithviraj Sukumaran: హీరో కాలులో 3 స్క్రూలు!

మలయాళ చిత్రసీమలో రిస్కీ స్టంట్స్ చేసే హీరోగా పేరు తెచ్చుకున్నాడు పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran). తన సినిమాల్లో డూప్…

1 day ago

Michael: బిలియన్ డాలర్ల క్లబ్బులో… కొత్త రికార్డు ఖాతాలో

మైఖేల్ జాక్సన్ (Michael Jackson) గురించి తెలియని వారు ఉండరు. ఈ తరం వారికి కూడా ఆయన పేరు, ఆయన…

2 days ago