సినిమా కంటెంట్ బాగుంటే చాలా.. టైటిల్ తో పని లేదా.. కొన్నాళ్లుగా నడుస్తున్న చర్చ ఇది. దీనికి కారణం, కొంతమంది తమిళ దర్శక, నిర్మాతలు తమిళ్ టైటిల్స్ ను యథాతథంగా తెలుగులో కూడా దించేయడమే. ఉదాహరణకు మొన్నొచ్చిన ‘వేట్టయన్’ సినిమానే తీసుకుంటే… ఆ టైటిల్ కు అర్థమేంటో తెలియక బుర్ర గోక్కున్నారు చాలామంది తెలుగు వాళ్లు, ఉత్తరాది వాళ్ళు. హిందీలో కూడా అదే పేరు.
విక్రమ్ హీరోగా నటించిన “తంగలాన్” విషయంలో కూడా జరిగింది. ఇప్పుడు “అమరన్” అంటూ మరోటి వస్తోంది. ఈ దీపావళికి విడుదల కానుంది శివ కార్తికేయన్, సాయి పల్లవి నటించిన “అమరన్.” ఇది కూడా తెలుగులో, ఇతర భాషల్లో అదే పేరుతో రిలీజ్ అవుతోంది.
ఇప్పుడంతా పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. సినిమా అనుకున్నప్పుడే దాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయాలని ప్లాన్స్ వేస్తున్నారు. అలాంటప్పుడు అన్ని భాషలకు సెట్ అయ్యే టైటిల్ పెట్టాలి కదా. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, ‘బాహుబలి’ తీశాడు. “పుష్ప”, “దేవర” వంటి సినిమాలు కూడా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యాయి ఆ టైటిల్స్. ఎందుకంటే అవి పాత్రలు పేర్లు.
మరి ఇదే ఆలోచన తమిళ మేకర్స్ ఎందుకు చేయట్లేదు. ఎందుకు అంతా బద్ధకం? పాన్ ఇండియా లెవల్లో విడుదల చెయ్యాలని అనుకున్నప్పుడు అందరికీ అర్ధమయ్యే పేరు పెట్టొచ్చు కదా.
నిజానికి ఒకే టైటిల్ ఉంటే సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ పెట్టడం, ట్రెండింగ్ లోకి రావడం ఈజీ అవుతుంది. అది వాస్తవమే కానీ అన్ని భాషల వాళ్లకు అర్ధమయ్యే ఒకే పేరుని ఎందుకు పెట్టరు మరి?
ఆ మధ్య ‘రాయన్” అని వచ్చింది. ఇప్పుడు ‘కంగువా’ అంటూ ఇంకోటి రానుంది.
ఇకనైనా అందరికీ అర్థమయ్యే, కనెక్ట్ అయ్యే టైటిల్స్ పెడితే బాగుంటుంది.
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…
హీరో నుంచి ముఖ్యమంత్రి కావడం అనేది అసాధారణ విజయం అని అంటున్నారు దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi). కలలాంటి…
ఒక్క మే నెల తప్ప మార్చి నుంచి జూన్ వరకు వచ్చే ఏడాది సమ్మర్ (Summer 2027)లో ప్రతి నెలా…
టాలీవుడ్ నుంచి మరో మహిళా దర్శకురాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన 'సింగ్…