‘మట్కా’ సినిమా చాలామంది కెరీర్స్ డిసైడ్ చేసే సినిమాగా మారింది. అందులో హీరోగా నటిస్తున్న వరుణ్ తేజ్ కు, ఆ సినిమాను డైరక్ట్ చేస్తున్న కరుణ కుమార్ కు ఇలా చాలామందికి ఆ సినిమా సక్సెస్ అవసరం. ఇప్పుడా జాబితాలోకి సలోని కూడా చేరింది.
అవును.. ‘మట్కా’ సినిమాలో సలోని కూడా ఉంది. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో ఆమె నటిస్తోంది.
మూవీలో సలోని క్యారెక్టర్ ని పద్మగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చీరకట్టులో హుందాగా కనిపించింది. ఫస్ట్ లుక్ చూస్తుంటే, ఆమెది సీరియస్ పాత్ర అనే విషయం తెలుస్తోంది.
ఈ సినిమాపై సలోనీ చాలా ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే, రీసెంట్ గా ఆమెకు సరైన హిట్ తగల్లేదు. నిజానికి ఆమె హీరోయిన్ గా క్లిక్ అవ్వాలని అనుకోవట్లేదు. కనీసం క్యారెక్టర్ ఆర్టిస్టుగా సెటిల్ అయినా చాలని భావిస్తోంది.
ఈ మేరకు ఆమె చాన్నాళ్ల కిందటే సెకెండ్ హీరోయిన్ పాత్రలకు, క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయింది. అయితే సరైన బ్యానర్లు, మంచి కథలు ఎంచుకోవడంలో విఫలమైంది. దీంతో కొన్ని సినిమాలు ఫ్లాప్ అవ్వగా, మరికొన్ని సినిమాలు విడుదలకు కూడా నోచుకోలేదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘మట్కా’ రూపంలో ఆమెకు కాస్త బజ్ ఉన్న సినిమా దక్కింది. అందుకే ఆశలన్నీ దీనిపైనే పెట్టుకుంది.
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…
సామజవరగమన సినిమా తర్వాత శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి చేతులు కలిపారు. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి…
'టాక్సిస్' (Toxic) సినిమాపై కొన్ని రోజులుగా నడుస్తున్న ట్రోలింగ్ కు సింపుల్ గా, సుత్తిలేకుండా కౌంటర్ ఇచ్చారు నిర్మాత వెంకట్…
పరిశ్రమలో ప్రతి ఒక్కరికి చేదు అనుభవాలు, జ్ఞపకాలు ఉంటాయి. నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali)కి కూడా…
భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డే క్రికెట్ మ్యాచ్‌లో నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) తన అద్భుతమైన స్టైలింగ్‌తో అందరి…