తలకొట్టేసినట్లు అనిపించింది: అశ్వనీదత్

“కల్కి 2898 AD” విజయంతో చాలా గర్వంగా ఉంది అంటున్నారు ప్రముఖ నిర్మాత సి. అశ్వనీదత్. అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమ సంస్థ ప్రతిష్టని మరింత పెంచింది అంటున్నారు అశ్వనీదత్. సినిమా విడుదలైన మూడో రోజు ఆనందంగా మీడియాతో ముచ్చటించారు.

“కల్కి 2898 AD” రిజల్ట్

చాలా సంతోషంగా ఉన్నాను. విజయం ఊహించిందే కానీ ఊహించిన దానికన్నా అఖండ విజయం వచ్చింది. హ్యాట్సప్ టు నాగ్ అశ్విన్. దర్శకుడిగా అతను ఎలాంటి సినిమా అయినా తీయగలడనే కాన్ఫిడెన్స్ నాకు మొదటి నుంచి ఉంది. అదే మా అమ్మాయిలతో చెప్పాను. తను ఏ సబ్జెక్ట్ చెప్పినా వెంటనే దూకేయమని అన్నాను. అలాంటి దర్శకుడు మాకు ఇంట్లోనే దొరికాడు అదృష్టం.

అతను ఏమి అనుకున్నాడో అలానే తీస్తారని తెలుసు, అలానే తీశారు. నాగ్ అశ్విన్ అడిగిన ప్రతిదీ ప్రొవైడ్ చేశాం.

అమితాబ్ బచ్చన్ మీ కాళ్ళకి నమస్కారించినప్పుడు మీ ఫీలింగ్ ఏమిటి ?

నాకు తలకాయ కొట్టేసినంత పనైయింది. ఆయన నన్నుఎప్పుడూ గౌరవిస్తారు. కలిసినప్పుడల్లా నమస్కారం పెట్టారు కానీ స్టేజ్ మీద ఆయన అలా చేయడం నేను అస్సలు ఊహించలేదు. అమితాబ్ గారు లెజెండ్. అలాంటి లెజెండ్ అలా చెయ్యడం గొప్పగా ఉంది అలాగే ఉంది ఆయన స్థాయి ముందు నేను ఏంటో కూడా తెలుసు. ఆయన గొప్పతనం అలాంటిది.

పార్ట్ 2 ఎప్పుడు?

కథ అనుకున్నప్పుడే పార్ట్ 2 చెయ్యాలని భావించాం. ఇక కమల్ గారు సినిమా చేస్తాను అన్న తర్వాత పార్ట్ 2పక్కాగా తీయాలని డిసైడ్ అయిపోయాం. కమల్ గారిది అద్భుతమైన పాత్ర. రెండో భాగంలో అసలైన మజా ఉంటుంది. పార్ట్ 2 రిలీజ్ ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేం.

ప్రభాస్ గురించి…

డార్లింగ్ అంటే నిజంగా డార్లింగ్. ఆయనతో పని చెయ్యడం చాలా బావుంది. నిర్మాతల హీరో.

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇండస్ట్రీకి ఎలా ఉండబోతుంది?

ఇకపై చింతపడాల్సిన అవసరం లేదు. చంద్రబాబు గారు అద్భుతంగా అభివృద్ధి చేస్తారు. పరిశ్రమకు అద్భుతంగా ఉంటుంది.

రాబోయే సినిమాలు?

శ్రీకాంత్ గారి అబ్బాయితో ఓ సినిమా ఉంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో ఓ సినిమా చేస్తున్నాం.

Admin

Recent Posts

నాగబంధంలో స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను: Nabha Natesh

విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'నాగబంధం'(Nagabandham)లో నభా నటేష్ (Nabha Natesh) మెయిన్ హీరోయిన్ గా…

2 hours ago

Sonakshi Sinha: అవకాశాలు తగ్గినా పర్లేదు!

సినిమా అవకాశాలు తగ్గినా, తాను అనుకున్న తరహా పాత్రలు రాకపోయినా పర్వాలేదని, తనకంటూ ఒక సంతోషకరమైన వ్యక్తిగత జీవితం ఉందని…

6 hours ago

Varanasi: ఓవర్సీస్ రేట్లు మరీ ఓవర్ గా ఉన్నాయట

రాజమౌళి (Rajamouli) సినిమా అంటే పాత రికార్డులు బద్దలవ్వాలి. కొత్త రికార్డులు స్టార్ట్ అవ్వాల్సిందే. వచ్చే ఏడాది విడుదల కానున్న…

7 hours ago

Peddi: మిగతా అన్ని భాషల్లోనూ అట్టర్ ఫ్లాప్

రామ్ చరణ్ నటించిన "పెద్ది" (Peddi) సినిమా జూన్ 4న విడుదలైంది. 25 రోజుల తర్వాత ఈ సినిమా పూర్తి…

7 hours ago

Ram Pothineni: ఈ రోజు నుంచి మొదలుపెట్టాడు

రామ్ పోతినేని (Ram Pothineni) హీరోగా మంచి పొజిషన్ లో ఉన్నాడు. పాపులారిటీ ఉంది. యూత్ లో క్రేజ్ ఉంది.…

8 hours ago

Sithara: జులై నుంచి అక్టోబర్, వరుసగా నాలుగు చిత్రాలు

వరుసగా సినిమాలు నిర్మిస్తోన్న సితార ఎంటర్ టైన్ మెంట్స్ (Sithara Entertainments) వచ్చే నెల నుంచి నెలకో సినిమా విడుదల…

23 hours ago