ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) “జాతి రత్నాలు” సినిమాతో ఫేమస్ అయింది. ఆమె చేసే సినిమాలు ఎక్కువగా కామెడిగానే ఉంటాయి. ఇప్పుడు ‘గాయపడ్డ సింహం'(Gaayapadda Simham)తో మరోసారి మెప్పించనుంది. మే 1వ తేదీన విడుదల కానున్న ఈ చిత్రం గురించి ఫరియా అబ్దుల్లా చెప్తున్న విశేషాలు…
మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది?
ఇందులో నా పాత్ర పేరు శాలిని. తను ఒక వ్లాగర్. ఇందులో తరుణ్ గారితో ఒక రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. డైరెక్టర్ కశ్యప్ చాలా డిఫరెంట్‌గా రాశారు. ఆయన ప్రపంచం, సృష్టించిన పాత్రలు అన్నీ చాలా హిలేరియస్ గా వచ్చాయి. మల్టిపుల్ లేయర్స్‌లో జరిగే కథ ఇది. ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంటుంది. నా పాత్ర పూర్తిగా హాస్యభరితంగా సాగుతుంది. ఈ సినిమాలో రైటింగ్ చాలా ఫన్నీగా ఉంది. డైరెక్టర్ కశ్యప్ ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ కూడా చేశారు. ఆయన యాక్టింగ్, డైరెక్షన్ రెండూ అద్భుతంగా ఉన్నాయి.
మీ కథల ఎంపిక ఎలా ఉంటుంది?
కథ విన్నప్పుడు నచ్చితే పాత్ర పెద్దదా చిన్నదా అని చూడకుండా తప్పకుండా చేస్తాను. ఈ సినిమా కథ చాలా క్రేజీగా ఉంటుంది. వినగానే కొత్తగా అనిపించింది.
తరుణ్ భాస్కర్, శ్రీ విష్ణులతో నటించడం ఎలా అనిపించింది?
తరుణ్ భాస్కర్ గారు చాలా సరదాగా ఉంటారు. ఆయన కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. ఆయనతో సీన్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. ఆయన చిన్న ఎక్స్‌ప్రెషన్ ఇచ్చినా నాకు నవ్వు వచ్చేస్తుంది. ఇందులో శ్రీ విష్ణు గారి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. కొత్తగా ఉంటుంది.
దుల్కర్ సల్మాన్ అంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఆయన చిత్రంలో చిన్న పాత్ర ఒప్పుకుంటారా?
చిన్న పాత్ర కాదు ఫుల్ లెంగ్త్ రోల్ చెయ్యాలని ఉంది.
మీరు డైరెక్ట్ కాబోతున్నారట?
అవును. వచ్చే ఏడాది నా డైరెక్షన్లో మూవీ ఉంటుంది.
జయకృష్ణ ఘట్టమనేని (Jaya Krishna Ghattamaneni) మొదటి చిత్రం… 'శ్రీనివాస మంగాపురం' (Srinivasa Mangapuram). ఈ నెల 30న విడుదల…
కావ్య థాపర్ (Kavya Thapar) పలు తెలుగు సినిమాల్లో నటించింది. అందాల ఆరబోతలో ఆమె ఎలాంటి ఆంక్షలు లేవు. ఐతే…
శ్రీ గౌరీ ప్రియ (Sri Gouri Priya) అచ్చ తెలుగు నటి. తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా అవకాశాలు రావు అనే…
నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఇటీవల షూటింగ్ లో గాయపడ్డారు. తాజాగా ఆయనకి సర్జరీ జరిగింది. ఐతే ఆసుపత్రి సర్జరీ…
'చెన్నై లవ్ స్టోరీ' (Chennai Love Story సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). శ్రీ గౌరీప్రియ…
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన ‘జన నాయకుడు’ (తమిళంలో జన నయగన్) తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే…